ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ashok Gajapathi Raju: ఎవరిపై కేసు పెట్టాలనే విచక్షణ ఈ ప్రభుత్వానికి లేదు

ABN, First Publish Date - 2023-08-09T10:59:13+05:30

చిత్తూరు జిల్లా అంగళ్లులో జరిగిన ఘటనకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏ1గా కేసు నమోదు చేయడంపై టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు స్పందించారు.

విజయనగరం: చిత్తూరు జిల్లా అంగళ్లులో జరిగిన ఘటనకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై (TDP Chief Chandrababu Naidu) ఏ1గా కేసు నమోదు చేయడంపై టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు (TDP Leader Ahok Gajapathi raju)స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎవరిపైన కేసులు పెట్టాలి.. ఎవరిపైన పెట్టకూడదు అనే విచక్షణ ఈ ప్రభుత్వానికి లేదని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి నచ్చకపోతే కేసులు పెడుతున్నారన్నారు. నాలుగున్నర కాలంలో టీడీపీపై అనేక కేసులు పెట్టారన్నారు. అభివృద్ధి మాత్రం లేదని.. పేపర్ ప్రకటనలు మాత్రం ఇస్తున్నారని తెలిపారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. భయాందోళనకు గురి చేయాలని చూడటం దారుణమన్నారు. చంద్రబాబుకు సెక్యూరిటీ తీసేస్తే చంపేస్తామని స్పీకర్ మాట్లాడడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాంటి వారిపై ఎలాంటి కేసులు పెట్టడం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో మంత్రులు తమ పని తాము చేయడం లేదన్నారు. రాజ్యాంగంపై గౌరవం లేకుండా చేస్తున్నారని అన్నారు. డీజీపీ పదే పదే చేతులు కట్టుకొని హైకోర్టు ముందు నిల్చోవడం సిగ్గుచేటన్నారు. టీడీపీ ఎప్పుడు బెదిరింపులుకు లొంగదని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని కేసులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయన్నారు. ప్రవర్తన, భాష మార్చుకోవాల్సిన అవసరం ఉందని హితవుపలికారు. ప్రతిపక్ష నాయకుడికి భద్రత లేకుండా తిరగకుండా చేయడం ఎక్కడా లేదన్నారు. చంద్రబాబు మీద రాళ్లు వేసిన ఒక్కరిపైన అయినా కేసు నమోదు చేశారా అని అశోక్‌గజపతిరాజు ప్రశ్నించారు.

Updated Date - 2023-08-09T10:59:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising