ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP Meeting: చంద్రబాబు లేకుండా తొలిసారిగా టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం

ABN, First Publish Date - 2023-10-21T11:05:17+05:30

తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం ప్రారంభమైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జులు, అనుబంధ సంస్థ ప్రతనిధులు హాజరయ్యారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కావడంతో ఆయన లేకుండా లోకేష్ అధ్యక్షతన జరుగుతున్న తొలి సమావేశం ఇది.

అమరావతి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం (Telugu Desam Party state wide meeting) శనివారం ఉదయం ప్రారంభమైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్(TDP Leader Nara Lokesh) అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, అనుబంధ సంస్థ ప్రతనిధులు హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) అక్రమ అరెస్ట్ కావడంతో ఆయన లేకుండా లోకేష్ అధ్యక్షతన జరుగుతున్న తొలి సమావేశం ఇది. నాయకులు, కార్యకర్తలతో సందడిగా టీడీపీ కేంద్ర కార్యాలయం మారింది.


అడ్డంకులు..

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి పోలీసు అడ్డంకులు సృష్టించారు. విజయవాడలో వీఐపీ మూమెంట్ ఉందంటూ మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం ఉన్న సర్వీస్ రోడ్‌లోకి ట్రాఫిక్ మళ్లించారు. దీంతో పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద భారీ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. ఈ క్రమంలో నారా లోకేష్, ముఖ్య నేతలు చాలా సేపు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. అయితే పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమయ్యాక పోలీసులు సర్వీస్ రోడ్డు నుంచి హైవే మీదకి ట్రాఫిక్ వదిలారు.

Updated Date - 2023-10-21T11:09:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising