Telugu Yuvatha: చంద్రబాబు, పవన్ ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ‘వ్యూహం’ సినిమా
ABN, First Publish Date - 2023-11-03T14:25:07+05:30
దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘‘వ్యూహం’’ సినిమాపై తెలుగు యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: దర్శకుడు రాంగోపాల్ వర్మ (Director Ramgopal Varma) ‘‘వ్యూహం’’ సినిమాపై తెలుగు యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు (Ravi Naidu is the State General Secretary of Telugu Youth) మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu), పవన్ కల్యాణ్‌ల (Janasena Chief Pawan Kalyan) ఆత్మగౌరవానికి భంగం కలిగేలా, పవన్ కల్యాణ్ అభిమానులు, చంద్రబాబు అభిమానులను రెచ్చగొట్టేలా సినిమా ఉందని తమకు సమాచారం అందిందన్నారు. వ్యూహం సినిమా ప్రదర్శించే సినిమా థీయేటర్ల వద్ద ఆవాంఛనీయ సంఘటనలు జరిగితే టీడీపీ (TDP) , జనసేన (Janasena) బాధ్యత వహించదని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో (Telangan Elections) జనసేన పోటీ చేస్తోందని.. అక్కడ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికల కమిషన్ కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సెన్సార్ బోర్డు తిరస్కరిస్తే, ముంబాయి సెన్సార్ బోర్డుకు అపీల్ వెళ్లారన్నారు. ఈ సినిమా యూ ట్యూబ్లలో కూడా రాకుండా బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. బాహుబలి, పుష్ప వంటి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా తీసుకుపోయిన వారున్న సమాజంలో ఇలాంటి చీడ పురుగులు ఉండకుండా సినీ పరిశ్రమ రాంగోపాల్ వర్మను బ్యాన్ చేయాలని రవి నాయుడు పేర్కొన్నారు.
Updated Date - 2023-11-03T14:25:08+05:30 IST