ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kanna Lakshminarayana: బీజేపీ నుంచి పోతూ పోతూ.. జీవీఎల్‌పై సెటైర్లు వేసిన కన్నా

ABN, First Publish Date - 2023-02-16T21:18:59+05:30

భారతీయ జనతాపార్టీ ప్రాథమిక, క్రియాశీల సభ్యత్వానికి సీనియర్‌ నాయకులు ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) రాజీనామా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: భారతీయ జనతాపార్టీ ప్రాథమిక, క్రియాశీల సభ్యత్వానికి సీనియర్‌ నాయకులు ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) రాజీనామా చేశారు. ఈ మేరకు జాతీయ కార్యాలయానికి గురువారం రాజీనామా లేఖను మెయిల్‌ ద్వారా పంపారు. ఆయనతో పాటు మరికొంత మంది వివిధ విభాగాలకు చెందిన రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు కూడా పార్టీకి రాజీనామా చేశారు. అంతకముందు గుంటూరులోని ఆయన నివాసంలో అనుచరులు, కార్యకర్తలతో ఆయన నివాసంలో సమావేశమై చర్చించారు. చర్చల అనంతరం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు అండమాన్‌ నికోబార్‌ దీవులు ఇనాచార్జి తాళ్ల వెంకటేష్‌యాదవ్‌ మరికొంత మంది సీనియర్‌ నాయకులు రాజీనామా చేశారు. అనంతరం కార్యకర్తలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘2014లో బీజేపీలో చేరాను. సామాన్య కార్యకర్త నుంచి పార్టీ పటిష్టానికి కృషి చేశాను. 2019 ఎన్నికలకు 10 నెలల ముందు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. ఆ సమయంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పర్యటించి బీజేపీ (BJP) తరపున అభ్యర్థులను నిలబెట్టగలిగాను. పాలక, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేక మంది నాయకులను బీజేపీలోకి చేర్చగలిగాను. అమరావతి విషయంలో సీఎం జగన్‌ (CM Jagan) తీసుకున్న అనాలోచిత, అజ్ఞాన నిర్ణయాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశాను. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక పోరాటాలు చేశాను. సోము వీర్రాజు (Somu Veerraju) అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆయన ఏకపక్ష ధోరణి, కక్ష సాధింపు చర్యలతో విసిగిపోయాం. పార్టీ కోసం, మోదీ, అమిత్‌ షాలపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్లు భరించాం. ఇక మా వల్ల కావడం లేదు. పార్టీని వీడటానికి కేవలం సోము వీర్రాజే కారణం. మరే ఇతర సమస్యలు లేవు. రాజకీయ జీవితంలో ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేశాను. నాకు పదవులు అవసరం లేదు. పని చేసుకుంటూ పోతే పదవులు వాటంతటే అవే వస్తాయి. ప్రస్తుతానికి ఏ పార్టీలో లేను. ఏ పార్టీలో చేరేది, భవిష్యత్‌ కార్యాచరణ కార్యకర్తలతో చర్చించి త్వరలోనే ప్రకటిస్తాను’’ అని వెల్లడించారు.

జీవీఎల్‌పై సెటైర్లు

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు (GVL Narasimha Rao) వ్యవహారశైలిపై కన్నా సెటైర్లు వేశారు. కాపుల రిజర్వేషన్లు, వంగవీటి రంగా (Vangaveeti Ranga) గురించి మాట్లాడితే నాయకుడిగా ఎదుగుతామని జీవీఎల్‌ వంటి వారు అనుకుంటుంటారు. కానీ ఆ పోరాటాల్లో వారు ఎంత వరకు పాల్గొన్నారు.. సమస్యల పట్ల ఎలాంటి కృషి చేశారు అనే విషయాలను కాపు ప్రజలు గమనిస్తూ ఉంటారు. కృష్ణాజిల్లా (Krishna District)కు రంగా పేరుపెట్టాలని జరిగిన పోరాటాల్లో జీవీఎల్‌ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల పట్ల కేంద్రంతో చర్చలు జరిపి, వాటి సాధనకు రాష్టప్రభుత్వంతో పోరాటాలు చేస్తే బాగుండేదని సూచించారు. ఇటువంటి ఓవర్‌నైట్‌ రాజకీయ నాయకులను తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చాలామందిని చూశానన్నారు. రెండు రోజుల కిత్రం కాపుల రిజర్వేషన్లు, జీవీఎల్‌ గురించి నేను మీడియాలో మాట్లాడిన మాటలు పూర్తిగా వాస్తవమన్నారు. అవి అబద్ధం అయితే ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాపులు సందిగ్ధంలో లేరని, వారి సమస్యలను ఎవరూ పరిష్కరిస్తారో వారికి బాగా తెలుసన్నారు.

Updated Date - 2023-02-16T21:19:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising