AP GOVT: పాడేరులో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఏపీ సర్కారు
ABN, First Publish Date - 2023-08-20T21:27:29+05:30
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు మంత్రి అమర్నాథ్ తెలిపారు. ప్రమాదంలో అంగవైకల్యానికి గురైతే రూ.5 లక్షలు, గాయాల పాలైన వారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ప్రకటించినట్లు మంత్రి అమర్నాథ్ వెల్లడించారు.
పాడేరులో ఘోర రోడ్డు ప్రమాదం (road accident Paderu) జరిగింది. పాడేరు ఘాట్ రోడ్ వ్యూ పాయింట్ వద్ద ఆర్టీసీ బస్సు (RTC BUS) బోల్తా పడింది. చెట్టుని తప్పించబోయి ఆర్టీసీ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 100 అడుగుల లోయలో ఆర్టీసీ బస్సు పడిపోయిందని ప్రయాణికులు చెబుతున్నారు.
Updated Date - 2023-08-20T21:28:21+05:30 IST