CM Jagan: సీఎం జగన్ కాన్వాయ్‌ని అడ్డుకున్న రైతులు.. పోలీసులు ఏం చేశారంటే..
ABN, First Publish Date - 2023-04-26T17:58:38+05:30
సీఎం జగన్ కాన్వాయ్‌ని (CM Jagan convoy) తుంపర్తి భూనిర్వాసితులు అడ్డుకున్నారు.
శ్రీసత్యసాయి జిల్లాలో ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. సీఎం జగన్ కాన్వాయ్‌ని (CM Jagan convoy) తుంపర్తి భూనిర్వాసితులు అడ్డుకున్నారు. నష్టపరిహారంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ రోడ్డుపై బైఠాయించి సీఎం జగన్‌పై రైతులు (Farmers) శాపనార్థాలు పెట్టారు. రైతులను పక్కకు నెట్టేసి సీఎం కాన్వాయ్‌ని పోలీసులు పంపించారు. సీఎం జగన్ పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM YS Jaganmohan Reddy) హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నార్పలలోనే హెలికాఫ్టర్ నిలిచిపోయింది. సాంకేతికలోపం కారణంగా హెలికాఫ్టర్‌లో పుట్టపర్తికి వెళ్లాల్సిన జగన్.. రోడ్డుమార్గాన బయలుదేరి వెళ్లారు. నార్పల నుంచి బస్సు ద్వారా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టపర్తికి బయలుదేరారు.
ఈరోజు ఉదయం అనంతపురం జిల్లాలో పర్యటించిన జగన్ నార్పలలో ‘‘జగనన్న విద్యా దీవెన’’ పథకం నిధులను విద్యార్థుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ పథకం ద్వారా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912 కోట్లు జమ చేశారు. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.20 వేలు చొప్పున సాయం అందించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువు కోసం ఎవరూ అప్పులపాలు కాకూడదనేదే తమ ఉద్దేశమన్నారు. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామని, నాడు-నేడుతో స్కూళ్ల రూపు రేఖలు మార్చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు.
Updated Date - 2023-04-26T18:08:03+05:30 IST