ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

VIjayawada: వైసీపీకి రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజీనామా

ABN, First Publish Date - 2023-09-30T12:14:47+05:30

రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, కార్యదర్శి నరేంద్రబాబులు వైసీపీకి రాజీనామా చేశారు.

విజయవాడ: రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, కార్యదర్శి నరేంద్రబాబులు వైసీపీకి రాజీనామా చేశారు. సర్పంచుల పట్ల ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు పాపారావు, నరేంద్ర బాబు వెల్లడించారు. శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా కాంగ్రెస్‌లో పని చేసి... తర్వాత వైసీపీలో చేరానన్నారు. సర్పంచుల సమస్యలపై ఎన్నోసార్లు పంచాయతీ రాజ్ మంత్రి, అధికారులను కలిశానని.. 15 శాతం నిధులు తమకు తెలియకుండా దారి మళ్లించారన్నారు. నిధులు, విధులు లేవని నిజాంపట్నంలో సీఎంను కలిసి చెప్పామన్నారు. సర్పంచి వ్యవస్థకు సమాంతరంగా వాలంటరీ వ్యవస్థను తెచ్చారు, ఇదేం న్యాయమని ప్రశ్నించారు. ఎందరో సర్పంచులు ఆత్మన్యూనతతో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం సర్పంచ్‌ల వ్యవస్థను డమ్మీగా మార్చిందని విమర్శించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇంకా చాలా మంది సర్పంచులు వైసీపీకి రాజీనామా చేసే అవకాశం ఉందన్నారు. త్వరలో జనసేన పార్టీలో చేరుదామని నిర్ణయించుకున్నట్లు పాపారావు ప్రకటించారు.

Updated Date - 2023-09-30T12:14:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising