Kakani Govardhan Reddy: పార్టీకి ద్రోహం చేసిన వారు క్షమార్హులు: మంత్రి కాకాణి
ABN, First Publish Date - 2023-03-26T20:28:42+05:30
ఒక పార్టీ టికెట్‌తో గెలిచి పార్టీ నియమాలకు కట్టుబడకుండా పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదని రాష్ట్ర వ్యవశాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు: ఒక పార్టీ టికెట్‌తో గెలిచి పార్టీ నియమాలకు కట్టుబడకుండా పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదని రాష్ట్ర వ్యవశాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి (Minister Kakani Govardhan Reddy) తెలిపారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLA Quota MLC Elections) జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పు చేయడం వల్లే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. జిల్లాలో ఎమ్మెల్యేలందరూ సీఎం జగన్ (CM Jagan) వల్లే గెలిచారని గుర్తుచేశారు. చెప్పినవారికి ఓటేయకుండా జగన్‌ను మోసం చేశారని దుయ్యబట్టారు. సమస్యలు ఉంటే సీఎంతో చెప్పుకోవాలని, విమర్శలు సరికాదన్నారు. ఎవరు ఎవరికి ఓటు వేశారో వారి అంతరాత్మకు, మనస్సాక్షికి తెలుసని, వారి వైఖరే వారు ఎవరికి ఓటు వేశారో తెలియచేస్తుందన్నారు. ఎన్నికలు జరిగిన పక్కరోజు కొంతమంది అసెంబ్లీకి కూడా రాకుండా ముఖం చాటేశారని విమర్శించారు. పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యేలను ప్రజలు చీత్కరించుకుంటున్నారని, తగిన సమయంలో సరైన రీతిలోనే బుద్ది చెపుతారన్నారు. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్యేలకు సంబంధించి వైపీసీ (YCP)కి ఈ ఎన్నికలు మొదటిసారన్నారు. కొంత క్లిష్టమైన ఈ ఎన్నికల ప్రక్రియలో కొంత వెనుకబడ్డామన్నారు. టీడీపీ (TDP) కూడా రెండో ప్రాధాన్యత ఓటుతోనే గెలిచిందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలిచామని సంబరపడిపోయే ప్రతిపక్షాలకు సాధారణ ఎన్నికల్లో ప్రజలే బుద్ది చెపుతారని కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.
Updated Date - 2023-03-26T20:28:42+05:30 IST