Tirumala: వామ్మో అక్టోబర్‌లో శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో తెలిస్తే?..
ABN, First Publish Date - 2023-11-03T10:41:33+05:30
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు.
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. వారాంతరాల్లో అయితే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ప్రతీరోజు కొన్ని వేల మంది ఆ తిరుమలేశుడిని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగి తేలుతుంటారు. ప్రతీనెల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో అక్టోబర్ మాసంలో శ్రీవారిని 21.75 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి హుండీ ద్వారా రూ.108.65 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే 1.05 కోట్ల లడ్డులను భక్తులకు టీటీడీ విక్రయించింది. 47.14 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మొత్తం 8.30 లక్షల మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Updated Date - 2023-11-03T10:41:34+05:30 IST