ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cancelled Trains: 25వ తేదీ వరకు ఎన్ని రైళ్లు రద్దు చేశారో చూడండి.. ట్రైన్ నంబర్లతో సహా..

ABN, First Publish Date - 2023-06-19T18:07:41+05:30

గుంటూరు, విజయవాడ రైల్వే డివిజన్ల పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన పనుల కారణంగా ఈనెల 25వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తోన్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు (ఆంధ్రజ్యోతి): గుంటూరు (Guntur), విజయవాడ (Vijayawada) రైల్వే డివిజన్ల పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన పనుల కారణంగా ఈనెల 25వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తోన్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) సీపీఆర్వో సీహెచ్ రాకేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నెంబరు. 17239 గుంటూరు -విశాఖపట్టణం సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (Simhadri Express) ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు, నెంబరు. 17240 విశాఖపట్టణం - గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు రద్దు చేశామన్నారు. అలానే ఈ నెల 21న నెంబరు. 07629 విజయవాడ - తెనాలి, నెంబరు 07874 తెనాలి - రేపల్లె, నెంబరు. 07875 రేపల్లె - తెనాలి, ఈ నెల 22న నెంబరు. 07282 తెనాలి - గుంటూరు, 24వ తేదీన నెంబరు 07783 విజయవాడ - గుంటూరు రైలు రద్దు చేస్తున్నామన్నారు.

ఇదేవిధంగా ఈ నెల 19 నుంచి 25 వరకు నెంబరు 07791 కాచీగూడ - నడికుడి, నెంబరు 07792 నడికుడి - కాచీగూడ, నెంబరు 07783 గుంటూరు - విజయవాడ, నెంబరు. 07779 గుంటూరు - మాచర్ల, నెంబరు. 07780 మాచర్ల - గుంటూరు, నెంబరు 07580 మాచర్ల - నడికుడి, నెంబరు. 07579 నడికుడి - మాచర్ల, నెంబరు. 17282 నరసాపూర్ - గుంటూరు, నెంబరు. 17281 గుంటూరు - నరసాపూర్, నెంబరు. 17228 గుంటూరు డోన్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నామన్నారు.

నెంబరు. 17227 డోన్ - గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు రద్దు చేస్తామన్నారు. నెంబరు. 07889 రేపల్లె -మార్కాపురం రోడ్డు రైలుని ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు గుంటూరు వరకే నడిపి నిలిపేస్తామన్నారు. నెంబరు 07890 మార్కాపురం రోడ్డు - తెనాలి రైలుని మార్కాపురం నుంచి గుంటూరు మధ్యన రద్దు చేసి గుంటూరు - తెనాలి మధ్యన నడుపుతామన్నారు. ఈ మార్పులను ప్రయాణీకులు, సీజనర్లు గమనించి రైల్వేకి సహకరించాలని సీపీఆర్వో విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-06-19T18:07:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising