AP Govt: ఏపీలో పలువురు ఐఏఎస్లు బదిలీ
ABN, First Publish Date - 2023-04-29T18:11:03+05:30
ఏపీలో పలువురు ఐఏఎస్లు బదిలీ చూస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్గా అనంతరాము (Anantharamu)ను బదిలీ చేశారు.
అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్లు బదిలీ చూస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్గా అనంతరాము (Anantharamu)ను బదిలీ చేశారు. మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా ఎండీ ఇంతియాజ్ (Md Imtiaz)కు పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయ డైరెక్టర్గా లక్ష్మీషాకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే రెవెన్యూశాఖలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు ఒకే విభాగంగా ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు ఉన్నాయి. రెండు శాఖలకూ ఇప్పటివరకు ఒకే అధికారి ఉన్నారు. అయితే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ (Stamps and Registration) శాఖ బాధ్యతలను తాజాగా సీఎస్ జవహర్‌రెడ్డి (CS Jawahar Reddy)కి ఏపీ ప్రభుత్వం అప్పగించింది.
ఇటీవల ఎనిమిది జిల్లాల కలెక్టర్లు సహా 56 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. శాంతి భద్రతల ఏడీజీ నుంచి ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ వరకూ స్ర్కూటినీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా 39మంది ఐపీఎస్ అధికారులకు బదిలీ, పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చింది. అధికార పార్టీ కోసం ‘పరిధి’ దాటి పనిచేసిన ఎస్సీ, బీసీ వర్గాల ఎస్పీలకు జిల్లాలు ఇవ్వకుండా షాకిచ్చిన జగన్... తన సొంతజిల్లా ఎస్పీని మాత్రం మూడేళ్లు దాటినా కడపలోనే ఉంచేశారు. వివాద రహితుడిగా పేరున్న దళిత డీఐజీ రవిప్రకాశ్‌ను అనంతపురం నుంచి మార్చేసి... గుంటూరు ఎస్పీగా వివాదాలతో బదిలీ అయిన అమ్మిరెడ్డికి ప్రభుత్వం అక్కడ పోస్టింగ్ ఇచ్చింది. పోలీసు శాఖలో డీజీపీ తర్వాత కీలకమైన శాంతి భద్రతల విభాగం ఏడీజీ పోస్టు నుంచి రవిశంకర్ అయ్యన్నార్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా బదిలీ చేసింది.
Updated Date - 2023-04-29T18:11:22+05:30 IST