Rain: అకాల వర్షం... జనజీవనం అస్తవ్యవస్తం
ABN, First Publish Date - 2023-05-30T20:26:04+05:30
పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)లో మంగళవారం కురిసిన అకాల వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వేసవి ఎండల తాపం నుంచి
భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)లో మంగళవారం కురిసిన అకాల వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వేసవి ఎండల తాపం నుంచి కాస్తంత ఉపశమనం కలిగినట్లు కనిపిస్తున్నా ఊహించని రీతిలో అత్యధిక మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం (Rain) పడింది. అన్ని వర్గాల ప్రజలను అవస్థల పాల్జేసింది. జిల్లాలో అకాల వర్షాలకు రైతులు ఇబ్బంది పడ్డారు. భీమవరం (Bhimavaram), ఆచంట, ఆకివీడు, కాళ్ల, ఉండి తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో వర్షం కురిసింది. ఆచంట మండలంలో ఇప్పటికీ అనేకచోట్ల ధాన్యం రాశులు, బస్తాలు రోడ్లపైనే ఉన్నాయి. అవి తడిచి ముద్దయ్యాయి. కొందరు రైతులు ధాన్యం బస్తాలు, కల్లాలపై బరకాలు కప్పుకుని కాపాడుకున్నారు. ఆకివీడులో రెండున్నర గంటలపాటు ఏకధాటిగా వర్షం పడింది. రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లల్లోకి నీరు చొచ్చుకుపోయింది. అకాల వర్షాలతో చివరి దశలో ఉన్న పంటలు పలు ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి.
Updated Date - 2023-05-30T20:26:04+05:30 IST