ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Varla Ramaiah: టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ పోలీసులపై వర్ల రామయ్య ఫైర్..

ABN, First Publish Date - 2023-08-24T20:22:34+05:30

ఏపీ పోలీసుల తీరుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి: ఏపీ పోలీసుల తీరుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.


"తప్పు చేసిన వారిని శిక్షించాల్సిన పోలీసులు, తప్పుడు కేసులు నమోదు చేస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుకూలంగా పోలీసులు తెలుగుదేశం పార్టీవారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో పోలీసులే టెర్రరిజం క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది పోలీసులకు గాయాలైతే దాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వం ఒక టెర్రర్ క్రియేట్ చేసి, తెలుగుదేశం వారిని గ్రామాల్లో లేకుండా తరిమేస్తోంది. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజానికి ప్రభుత్వం స్వస్తి పలకాలి. పుంగనూరు ప్రాంతంలో శాంతి నెలకొల్పాలి. కేసులను బూచీగా చూపి టీడీపీ వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీసులపై దాడి అని పుంగనూరు, మదనపల్లి, అంగళ్లలలో టీడీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడం ఎక్కడి న్యాయం, ఎక్కడి ధర్మం?. కొంతమంది పోలీసులు అధికార పార్టీకి దాసోహం చేస్తూ, నాయకుల అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఆడవారు, వృద్ధులు, చిన్నపిల్లలను కూడా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అధికార పార్టీతో పెట్టుకుంటే ఇదే గతి అని భయపెడ్తున్నారు. ఇది చాలా అన్యాయం. పోలీసులు పద్ధతి ప్రకారం దర్యాప్తు చేయాలి. లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులపాలౌతారు. ప్రతిదాంట్లో ఏడెనిమిది కేసులు నమోదు చేసి అదర్స్ అని రాసి కనిపించిన ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అదర్స్ లో ఇరికించి జైలుకు పంపాలని ప్రభుత్వం కుట్ర పన్నింది. పుంగనూరు పోలీసులు అశాంతికి కారకులౌతూ, ప్రశాంతత లేకుండా చేస్తూ, భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈరోజు కోర్టులో వివిధ ప్రాంతాల నుంచి ఇంతమంది న్యాయవాదులు ఒక్క కేసులో వాదించడానికి రావడం ప్రభుత్వ టెర్రరిజానికి నిదర్శనం." అని వర్ల రామయ్య అన్నారు.

Updated Date - 2023-08-24T20:22:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising