ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Visakhapatnam: టీడీపీ కార్యాలయంలో అఖిలపక్షం భేటీ

ABN, First Publish Date - 2023-10-11T14:54:06+05:30

విశాఖ టీడీపీకార్యాలయంలో అఖిలపక్ష భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన, సీపీఐ నేతలు హాజరయ్యారు.

విశాఖపట్నం: విశాఖ టీడీపీ కార్యాలయంలో అఖిలపక్ష భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి టీడీపీ (TDP), జనసేన (Janasena), సీపీఐ (CPI) నేతలు హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) అరెస్ట్ నేపథ్యంలో విశాఖలో అఖిలపక్షం సమావేశమైంది. ఈ సందర్భంగా టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా అరాచక పాలనను ఎదుర్కొంటామని తెలిపారు. సమన్వయంతో పని చేసి వైసీపీ పాలనకు రాజకీయ సమాధి కడతామన్నారు.


ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఏపీలో అప్రజాస్వామిక విధానాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. 16 నెలలు జైల్లో ఉండి ఆర్ధిక నేరగాడిగా ముద్రపడ్డ జగన్.. చంద్రబాబును కూడా జైల్లో పెట్టాలనే అక్కసుతో వ్యవహరించారని అన్నారు. పొత్తులకు సమయం ఉన్నపట్టికీ దమ్మూ ధైర్యంతో స్నేహ హస్తం ఇచ్చారన్నారు. చంద్రబాబు అరెస్టైన రోజు పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి వస్తోన్న సమయంలో విమానం ల్యాండింగ్ కాకుండా అనేక ప్రయత్నాలు చేశారన్నారు. ఒక మేజర్ అంశం నడుస్తున్నప్పుడు దాన్ని దృష్టి మళ్లించడం జగన్‌కు తెలుసని విమర్శించారు. 25 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని గుర్తించారన్నారు. స్థానిక అంశాలపై దృష్టి పెట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని హితవుపలికారు. ఒక్క ఛాన్స్ పూర్తయ్యే సమయం దగ్గర పడుతోందని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Updated Date - 2023-10-11T14:54:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising