ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Visakha: ముందస్తు ప్లాన్ ప్రకారమే చంద్రబాబు అరెస్టు: అయ్యన్న

ABN, First Publish Date - 2023-09-12T16:20:45+05:30

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకో పరిపాలన జరుగుతోందని, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమని, చంద్రబాబు అరెస్టులో సీఐడీ అధికారులు వ్యవహరించిన తీరు అత్యంత హేయమని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో సైకో పరిపాలన (Psycho Administration) జరుగుతోందని, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు (Chandrababu)ను అరెస్టు చేయడం దారుణమని, చంద్రబాబు అరెస్టులో సీఐడీ అధికారులు (CID Officials) వ్యవహరించిన తీరు అత్యంత హేయమని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) విమర్శించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును ఆయన పెళ్లి రోజు అరెస్టు చేశారని, ముందస్తు ప్లాన్ ప్రకారమే అరెస్టు చేశారని ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (Skill Development Project) ద్వారా అనేక మంది యువతకు ఉపాధి లభించిందని, యువతకు ఉపాధి కల్పించడం చంద్రబాబు చేసిన తప్పా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టులో సాక్ష్యాలు చూపించలేకపోయారన్నారు.

16 నెలలు జైల్‌లో ఉన్న జగన్ (Jagan).. చంద్రబాబును ఒక్క రోజైనా జైల్‌లో పెట్టాలని చూసారని అయ్యన్న పాత్రుడు అన్నారు. తనను కూడా విశాఖ ఎయిర్ పోర్టులో అరెస్టు చేయలేదని.. కిడ్నాప్ (Kidnapping) చేశారని.. పోలీసులు తనను ఎక్కడికి తీసుకువెళ్తున్నారో చెప్పలేదన్నారు. ప్రజలు రోడ్లపైకి రావడం చూసి 41 నోటీస్ (41 Notice) ఇచ్చి తనను వదిలేశారన్నారు. ప్రాజెక్టులు అమలు చేసేటప్పుడు మంత్రులు నిర్ణయం తీసుకుంటారని... అధికారులు అమలు చేస్తారని అన్నారు. దొంగకే బెయిల్ రాగ తమకెందుకు బెయిల్ రాదు.. బెయిల్ వస్తుందనే నమ్మకం తమకుందని అయ్యన్న పాత్రుడు అన్నారు.

Updated Date - 2023-09-12T16:20:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising