ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ganta Srinivasrao: ఇది ట్రైలర్ మాత్రమే...అసలైనది తర్వాత ఉంది

ABN, First Publish Date - 2023-05-30T12:18:51+05:30

మహానాడు ఊహించిన దానికంటే విజయవంతం అయిందని.. అందరికీ కృతజ్ఞతలు అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: మహానాడు (TDP Mahanadu) ఊహించిన దానికంటే విజయవంతం అయిందని.. అందరికీ కృతజ్ఞతలు అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Former Minister Ganta Sinivas Rao)అన్నారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు చిత్రపటానికి టీడీపీ నేతలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ... మినీ మేనిఫెస్టో ప్రజల్లో సంచలనం కలిగించిందని... వైసీపీ నేతల్లో గుబులు రేగుతోందని అన్నారు. కొంతమంది ఉక్రోషం తట్టుకోక మేనిఫెస్టోను వైసీపీ నేతలు చించివేశారని మండిపడ్డారు. టీడీపీకి మేనిఫెస్టో.. భగవద్గీత, ఖరాన్, బైబిల్ లాంటిందని చెప్పుకొచ్చారు. ఇది ట్రైలర్ మాత్రమే...అసలైనది తర్వాత ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో... మేధోమథనం జరిగిన తర్వాతే మేనిఫెస్టోనిను విడుదల చేశారని తెలిపారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో విధ్వంసపాలన జరుగుతోందన్నారు. అమ్మఒడి ఎంత మంది ఉన్నా ఇస్తామని చెప్పి... ఇప్పుడు ఒక్కరికే ఇస్తున్నారని విమర్శించారు. గతంలో దీపం పథకం తెచ్చిన ఘనత చంద్రబాబు దే అని... ఇప్పుడు మూడు గ్యాస్ సిలెండర్‌లు ఉచితంగా ఇస్తామని అన్నారని అన్నారు. యువగళం పాదయాత్ర విజయవంతంగా జరుగుతోందన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలు... నిరుద్యోగులకు వరమన్నారు. బీసీలకు ఒక రక్షణ చట్టం.. ఇంటింటింటికి మంచి నీరు చాలా మంచి పథకాలు అని ఆయన చెప్పుకొచ్చారు.

సూపర్ 6 పథకాలు చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) ప్రకటించారని.. అయితే వైసీపీ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. నాలుగేళ్ల పాలనలో చేసింది అంతా అరాచకం తప్ప అభివృద్ధి లేదన్నారు. అరాచకంలో ఆఫ్గనిస్తాన్.. అప్పుల్లో శ్రీలంకను ఏపీ మించిపోయిందని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు... సీపీఎస్‌ను రద్దు చేస్తామని మాట తప్పారన్నారు. ఎక్కువమంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదాను మెడలు వంచి తెస్తామన్నారని.. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారి మెడలు వంచుతున్నారని దుయ్యబట్టారు. సంపూర్ణ మద్యపాన నిషేధమని చెప్పి... జగన్ మాట తప్పారన్నారు. 30 లక్షల ఇళ్ల నిర్మాణం అన్నారని... 3 వేల ఇళ్లు కూడా కట్టలేదన్నారు. మెగా డీఎస్సీ అన్నారు.. మాట తప్పారని మండిపడ్డారు. 3 వేల పెన్షన్ అన్నారని.. ఇప్పుడు ఎంత ఇస్తున్నారని ప్రశ్నించారు. రైల్వే జోన్, పోలవరం లోనూ మాట తప్పి మడమ తిప్పారని వ్యాఖ్యలు చేశారు. కరెంట్ చార్జీలు 7 సార్లు పెంచారని... పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలోనే ఎక్కువన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్ తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం చంద్రబాబుదన్నారు. నరకాసుర పాలనకు చమరగీతం పాడాలని తెలిపారు. జగన్ అన్న వదిలిన బాణం షర్మిల, తల్లి విజయమ్మ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలన్నారు. జగన్ నుంచి ఆయన కుటుంబ సభ్యులు దూరం అయ్యారన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా.. టీడీపీ అధికారంలోకి వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Updated Date - 2023-05-30T12:18:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising