Ganta Srinivasa Rao: నిరుద్యోగుల్ని మోసం చేయడానికే నోటిఫికేషన్లు
ABN, First Publish Date - 2023-12-09T15:00:11+05:30
వైసీపీ ప్రభుత్వంపై (Ycp Government) టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు (Ganta Srinivasa Rao) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శలు గుప్పించారు.
విశాఖ: వైసీపీ ప్రభుత్వంపై (Ycp Government) టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు (Ganta Srinivasa Rao) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శలు గుప్పించారు. ‘‘ఎన్నికలకు రెండు నెలల ముందు గ్రూప్ 1&2 నోటిఫికేషన్ల పేరుతో రాష్ర్టంలో మరో కొత్త మోసానికి తెరలేపిన జగనన్న (Cm jagan). చివరకు ఉద్యోగాల భర్తీని కూడా రాజకీయ ఎత్తుగడగా వాడుకుంటూ ఇష్టానుసారంగా నోటిఫికేషన్లు జారీ చేస్తూ నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారు. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే వారి పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరేనా..?, ఇదంతా ఎన్నికల జిమ్మిక్కు కాకా మరేమిటి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు అధైర్య పడాల్సిన అవసరం లేదు.. భవిష్యత్తు మనదే... రేపు అధికారంలోకి రాబోతుంది చంద్రన్న ప్రభుత్వమే (Chandrababu). 2024లో మీ పోస్టులను భర్తీ చేసి, మీ ఉద్యోగాలను మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వమే తీసుకుంటుంది.’’ అని గంటా పేర్కొన్నారు.
Updated Date - 2023-12-09T15:02:12+05:30 IST