AP News: జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై గంటా శ్రీనివాసరావు కామెంట్స్
ABN, First Publish Date - 2023-05-09T15:22:03+05:30
సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ప్రారంభించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంపై టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) ట్విట్టర్ (Twitter) వేదికగా కామెంట్స్ చేశారు.
విశాఖపట్నం: సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ప్రారంభించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంపై టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) ట్విట్టర్ (Twitter) వేదికగా కామెంట్స్ చేశారు. ‘‘జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రారంభిస్తున్నా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంకు ఇప్పటికే జిల్లాల్లో జరుగుతున్న స్పందన కార్యక్రమంకు మధ్య వ్యత్యాసం ఏమైనా ఉందా..? అని ప్రశ్నించారు. గడిచిన నాలుగేళ్లుగా స్పందనకు కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజనం ఏమైనా వుందా?.. రాష్ట్రంలో గడిచిన 4 సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలు చిన్నాభిన్నమైపోయారని అన్నారు.
ఏపీలో ఇప్పుడు సమస్యలు లేనివారు ఎవరైన ఉన్నారా? అని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ‘‘తమ పొలాలు రాజధానికి ఇచ్చి దగా పడ్డ అమరావతి రైతుల సమస్యలు పరిష్కరిస్తారా..?.. జీతం ఎప్పుడు పడుతుందో అని ఎదురు చూపులు చూస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా..?; కరువులతో అల్లాడుతూ ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్న పేద రైతుల సమస్యలు పరిష్కరిస్తారా..?; పెన్షన్ ఎప్పుడు పడుతుందో అని ఎదురు చూస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా..?; విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా..?; మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ (CPS) రద్దు చేస్తారని మీకు ఓటు వేసి.. మోసపోయిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా..?; గడిచిన 4 ఏళ్ల నుంచి జీతాలు సరిగ్గా పడక, జీతాలు పెంచక ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా..?; అధికారంలోకి వచ్చిన వెంటనే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి.. ఇప్పుడు దాన్నే ఆదాయ వనరుగా మార్చి, మీరు తెచ్చిన కొత్త నాసిరకం బ్రాండ్లు తాగి ప్రాణాలు కోల్పోయి బజారున పడ్డ వారి కుటుంబ సభ్యుల సమస్యలు పరిష్కరిస్తారా..?; మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పోగొట్టుకున్న అవ్వ, తాతల సమస్యలు పరిష్కరిస్తారా?’’ అంటూ గంటా శ్రీనివాసరావు ప్రశ్నల వర్షం కురిపించారు.
Updated Date - 2023-05-09T15:22:03+05:30 IST