ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ganta Srinivasarao: స్కిల్ సెంటర్లను ప్రభుత్వం డస్ట్ బిన్‌లుగా మార్చేసింది

ABN, First Publish Date - 2023-10-26T13:45:50+05:30

విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను గురువారం ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ..

విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University)లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల (Skill Development Centers)ను గురువారం ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao), వెలగపూడి రామకృష్ణ బాబు (Velagapudi Ramakrishna Babu) పరిశీలించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల పనితీరుపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. మంత్రులు, సలహాదారులు, సామంతులు ఎవరు వచ్చిన చర్చకు రెడీ అని సవాల్ విసిరారు. స్కిల్ సెంటర్లలో అక్రమాలు జరిగినట్టు నిరూపించగలిగితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధమన్నారు.

జగన్ ప్రభుత్వం (Jagan Govt.) డెవలప్‌మెంట్ సెంటర్లను డస్ట్ బిన్‌ (Dust bin)లుగా మార్చేసిందని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (Center of Excellence) కింద ఏర్పాటైన కేంద్రాలలో వేలాది మంది ట్రైనింగ్ అయ్యారన్నారు. రాజకీయ కారణాలతో స్కిల్ సెంటర్లను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. పొలిటికల్ రివెంజ్‌ (Political Revenge)తోనే చంద్రబాబు (Chandrababu)పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కోర్టులు వెకేషన్ తర్వాత చంద్రబాబుకు విముక్తి లభిస్తుందని గంటా శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-26T13:45:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising