Gudivada Amarnath: కేంద్రానికి కాకపోతే.. రష్యాలో పుతిన్‌కు వెళ్లి చెప్పుకో.. పవన్‌పై మంత్రి ఫైర్
ABN, First Publish Date - 2023-08-11T11:17:02+05:30
జగన్‌ను మళ్లీ సీఎం చేయవద్దని పవన్ అన్నారని... తనని ముఖ్యమంత్రి చేయమని ఎక్కడా కోరలేదని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.
విశాఖపట్నం: జగన్‌ను (CM Jagan) మళ్లీ సీఎం చేయవద్దని పవన్ అన్నారని... తనని ముఖ్యమంత్రి చేయమని ఎక్కడా కోరలేదని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (Minister Gudivada Amarnath) అన్నారు. రూ.30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని అన్నారని... వలంటీర్ల మీద అవాస్తవాలు మాట్లాడారని మండిపడ్డారు. జగన్ సైన్యం ... వలంటీర్ల వ్యవస్థ అని చెప్పుకొచ్చారు. ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులకు వేధిస్తే పవన్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి ఎక్కడ ఉందో పవన్‌కే తెలుసన్నారు. గత ప్రభుత్వంలో అక్రమాలపై ఎందుకు పవన్ మాట్లాడలేదని నిలదీశారు. పవన్ కేంద్రంతో చెబుతానని అంటున్నారని.. తమకేమీ భయమని అన్నారు. ఎవరికి భయపడే ప్రభుత్వం జగన్ ది కాదని.. కేంద్రానికి కాకపోతే.. రష్యాలో పుతిన్‌కు వెళ్లి చెప్పుకో అంటూ వ్యాఖ్యలు చేశారు. పవన్‌కు పలుకుబడి ఉంటే.. కేంద్రం దగ్గరికి వెళ్ళి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలన్నారు. జగన్ ఎవరికీ భయపడే వ్యక్తి కాదని.. సోనియా గాంధీనే జగన్ ఎదిరించారన్నారు. పవన్ ఒక బాబా.. అంటే బాబు గారి బానిస అంటూ విరుచుకుపడ్డారు. హైదారాబాద్‌లో పవన్ కళ్యాణ్ ఇళ్లు కొండ మీదే కట్టుకోలేదా అని అడిగారు. పవన్ విశాఖలో ఇళ్లు కొనుకుంటాననడాన్ని స్వాగతిస్తూన్నామని... ఎవరైనా రాజధానికి రావాల్సిందే అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు.
Updated Date - 2023-08-11T14:08:55+05:30 IST