Minister Roja: చంద్రబాబు సైకో... లోకేష్ ఐరన్ లెగ్ సైకో

ABN, First Publish Date - 2023-01-28T14:15:11+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు సైకో... నారా లోకేష్ ఐరన్ లెగ్ సైకో అంటూ మంత్రి రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Minister Roja: చంద్రబాబు సైకో... లోకేష్ ఐరన్ లెగ్ సైకో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) సైకో... నారా లోకేష్ (Nara Lokesh) ఐరన్ లెగ్ సైకో అంటూ మంత్రి రోజా (AP Minister Roja) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం విశాఖ శారదాపీఠం వార్షికోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ లాంటి ఐరన్ లెగ్ రాష్ట్రం అంతా నడిస్తే పరిస్థితి ఏంటి అని ప్రజలు భయపడుతున్నారన్నారు. మొదటిసారి గోదావరి పుష్కరాలకి వెళ్తే 29 మందిని పొట్టన పెట్టుకున్నారని అన్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేస్తే వాళ్ళ నాన్నకి ఓటుకు నోటు కేసులో, నోటీసులు వచ్చాయని తెలిపారు. మొన్న పోస్టర్ లాంచింగ్ చేస్తే 8 మంది చనిపోయారని... నిన్న పాదయాత్ర చేస్తే తారకరత్న గుండెపోటు వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పాండిత్యాన్ని చూసి ఆయన పులకేసి అనాలని యెద్దేవా చేశారు. నిరుద్యోగులంతా సంతోషంగా ఉన్నారని... రోడ్డు మీదకు వచ్చింది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఆ పార్టీలో కొంతమంది అని అన్నారు. చంద్రబాబు 11 మందిని చంపేశారని... నిన్న ఒకరికి హార్ట్‌ఎటాక్ వస్తే మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-01-28T14:15:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising