ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLA Ganta: బోగస్ ఓట్ల చేర్పులు.. 175 అసెంబ్లీ స్ధానాల్లో ఉన్నాయి

ABN, First Publish Date - 2023-09-08T14:02:22+05:30

విశాఖ: ఉత్తర నియోజక వర్గంలో దొంగ ఓట్లు నమోదుపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ బోగస్ ఓట్ల చేర్పులు ఒక్క ఉత్తర నియోజకవర్గంలోనే కాదని.. 175 అసెంబ్లీ స్ధానాల్లో ఉన్నాయన్నారు.

విశాఖ: ఉత్తర నియోజక వర్గంలో దొంగ ఓట్లు (Stolen Votes) నమోదుపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (MLA Ganta Srinivasarao) స్పందించారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ బోగస్ ఓట్ల చేర్పులు ఒక్క ఉత్తర నియోజకవర్గంలోనే కాదని.. 175 అసెంబ్లీ స్ధానాల్లో ఉన్నాయన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇదే అంశంపై ఢిల్లీ వెళ్లి ఎలక్షన్ కమిషన్‌ (EC)కు ఫిర్యాదు చేశారని.. ఫలితంగానే ఇంటింటి సర్వే (Household Survey) జరుగుతోందన్నారు.‌ ఉత్తర నియోజకవర్గంలోని దాదాపు అన్ని వార్డుల్లో బోగస్ ఓట్లు ఉన్నట్లు ప్రాధమికంగా తేలిందని, దీనిపై దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

బోగస్ ఓట్ల తొలగింపులో అధికారులు అలసత్వంగా ఉంటే చర్యలు తీసుకోవాలని, వచ్చే ఎన్నికల్లో ఎలాగూ గెలవలేమనే ఉద్దేశంతోనే వైసీపీ (YCP) అవకతవకలకు పాల్పడుతోందని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఒక్కో డోర్ నెంబర్‌పై గరిష్టంగా 200 ఓట్లు ఉన్నాయంటే అక్రమాలు ఏ స్ధాయిలో జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఏపీలో విధ్వంసం తప్ప అభివృద్ది లేదన్నారు. పథకాల అమలులో 98.5 అమలు చేయడం కాదని.. 98.5 శాతం జగన్ ప్రభుత్వం (Jagan Govt.) విఫలమైందన్నారు.

Updated Date - 2023-09-08T14:02:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising