ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MP GVL: ఈనెల 25న జరిగే విరాట్ హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

ABN, First Publish Date - 2023-11-02T21:03:43+05:30

విశాఖపట్నంలో ఈ నెల 25వ తేదీన జరిగే విరాట్ హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఎంపీ జీవీఎల్ నరసింహరావు ( MP GVL Narasimha Rao ) కోరారు.

విశాఖపట్నం: విశాఖపట్నంలో ఈ నెల 25వ తేదీన జరిగే విరాట్ హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఎంపీ జీవీఎల్ నరసింహరావు ( MP GVL Narasimha Rao ) కోరారు. గురువారం నాడు విశాఖలో విరాట్ హిందూ సమ్మేళనం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ...‘‘హిందూ ధర్మం కోసం హిందువులు అంతా ఏకం కావాలి. హిందూ ధర్మంపై ఇటీవల సినీ హీరో ఉదయ నిధి స్టాలిన్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పాలి. హిందువుల కోసం పోరాడే నేతలను ప్రజలు ఆదరించాలి. మోదీ హయాంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. వచ్చే ఎన్నికలల్లో దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుంది’’ అని జీవీఎల్ పేర్కొన్నారు.

ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా: శ్రీనివాసవర్మ

హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని విరాట్ హిందూ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస వర్మ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల పరిరక్షణ కోసం విరాట్ హిందూ సంఘం ఏర్పడిందని చెప్పారు. ఈ నెల 25వ తేదీన విశాఖపట్నంలో విరాట్ హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని హిందు బంధువులంతా విజయవంతం చేయాలని శ్రీనివాసవర్మ పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-02T21:03:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising