ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Purandeshwari: టీటీడీలో మత మార్పిడి జరుగుతోంది

ABN, First Publish Date - 2023-08-23T13:13:30+05:30

విశాఖపట్నం: బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం బుధవారం విశాఖలో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో మత మార్పిడి జరుగుతోందని, అక్కడ అడుగులు నాశనం అవుతుంటే టీటీడీ పట్టించుకోవడం లేదన్నారు.

విశాఖపట్నం: బీజేపీ (BJP) రాష్ట్ర పదాధికారుల సమావేశం బుధవారం విశాఖలో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeshwari) మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో మత మార్పిడి జరుగుతోందని, అక్కడ అడుగులు నాశనం అవుతుంటే టీటీడీ పట్టించుకోవడం లేదన్నారు. ఎర్రచందనం (Red Sandalwood) దారి మళ్ళిస్తున్నారని, అడవులను నాశనం చేయడం వల్లనే అక్కడున్న జంతువులు జనావాసాలకు వస్తున్నాయని, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆందోళన కరంగా ప్రభుత్వం పనితీరుందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలలో ఏడు లక్షల నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందన్నారు. అప్పుల భారంతో రాష్ట్ర ప్రభుత్వం కృంగిపోతుందని.. ప్రభుత్వ ఆస్తులను సైతం తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు.

సీఎం జగన్ (CM Jagan) ఇంటి దగ్గరలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని, మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేదని పురందేశ్వరి అన్నారు. గ్రామపంచాయతీల నిధులను దారి తప్పించారని.. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బకాయిలు ఇవ్వలేదని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిర్వీర్యం చేయాలని కేంద్రం ఎప్పుడు ఆలోచన చేయలేదని, ఉద్యోగులకు ఎలాంటి భరోసా ఇవ్వాలి.. వారి భవిష్యత్‌పై దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉందన్నారు.

పార్టీకి పదాధికారులు అంకితభావంతో పనిచేయాలని, ఒకరికిద్దరికి బాధ కలిగి ఉండవచ్చునని, ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని పురందేశ్వరి అన్నారు. అగ్ర నాయకులు ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు ఇస్తారని, ప్రతి కార్యకర్తను కలుపుకుంటూ పోవాలని ఆమె హితవు పలికారు. పదవులు వచ్చిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. బీజేపీపై ప్రతి కార్యకర్తకు ఆత్మవిశ్వాసం పెరిగే విధంగా పదాధికారులు పనిచేయాలని, క్రమశిక్షణతో పనిచేయాలని, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని పురందేశ్వరి పిలుపిచ్చారు.

Updated Date - 2023-08-23T13:13:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising