TDP: ఎన్ని చేసినా అవినాష్ రెడ్డి అరెస్ట్ కావడం ఖాయం: బండారు
ABN, First Publish Date - 2023-04-20T12:48:02+05:30
ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కావడం ఖాయమని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి స్పష్టం చేశారు.
విశాఖపట్నం: ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (YCP MP YS Avinash Reddy) అరెస్ట్ కావడం ఖాయమని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి (Former Minister Bandaru Satyanarayana Murthy) స్పష్టం చేశారు. గురువారం పెందుర్తి టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు (TDP Cheif Chandrababu naidu) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ... చంద్రబాబు 73 సంవత్సరాల వయసులో అలుపెరగకుండా అధికార పార్టీని ముచ్చమటలు పట్టిస్తున్నారన్నారు. 2024 ఎలక్షన్‌లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వివేకా హత్య జరిగిన తర్వాత రక్తాన్న కడిగి, కుట్లు వేసిన వ్యక్తి ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వస్తే చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడని చెప్పే సజ్జల.. అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా కోర్టు ఉత్తర్వులు వచ్చాయంటే వ్యవస్థను మేనేజ్ చేశారా? అని ప్రశ్నించారు. ఏదైనా నేరం జరిగితే నేర స్థలంలో ఉన్న ఆధారాలను చెరపకూడదనే విషయాన్ని ఎంపీ అవినాష్ రెడ్డికి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి తెలియదా అని నిలదీశారు. ఘటనా స్థలానికి పోలీసులు రాకముందే నేర స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేశారని ఆరోపించారు. చనిపోయిన వివేకానంద రెడ్డి బాడీకి కుట్లు వేయడం రక్తాన్ని శుభ్రపరచడం నిజం కాదా అంటూ బండారు సత్యనారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-04-20T12:48:02+05:30 IST