ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kalavenkatrao: ఈ ఏడాది చివర్లోనే ఎన్నికలన్న టీడీపీ నేత

ABN, First Publish Date - 2023-06-22T13:28:35+05:30

ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. గురువారం పాయకరావుపేట లో భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య యాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... జగన్‌కు ఎన్నికలు అంటే భయం పట్టుకుందని.. వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీ బంగళాఖాతంలో కలవడం ఖాయమని వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనకాపల్లి: ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని టీడీపీ నేత కళా వెంకట్రావు (TDP Leader Kala Venktrao) అన్నారు. గురువారం పాయకరావుపేట లో భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య యాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... జగన్‌కు (CM Jagan) ఎన్నికలు అంటే భయం పట్టుకుందని.. వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీ బంగళాఖాతంలో కలవడం ఖాయమని వ్యాఖ్యలు చేశారు. లోకేష్ (Nara lokesh) ఉదయించే సూర్యుడని... యువగళంకు మంచి స్పందన వస్తోందన్నారు. జగన్ వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ రాలేదరి... ఉన్న పరిశ్రమలు పోయాయని విమర్శించారు. యువతకు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవన్నారు. జగన్‌ను అప్పుల అప్పారావు అంటూ విమర్శించారు. ఆయనకు పాలన, అభివృద్ధి చేయడం చేత కాదన్నారు. చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) వెనుక కోట్లాది మంది ప్రజలు ఉన్నారని.. మీరు కొట్టే క్లాప్స్ సౌండ్ తాడేపల్లికి వినిపించాలన్నారు. సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ టీడీపీ అని స్పష్టం చేశారు. పెన్షన్ 3 వేలు ఇస్తామని జగన్ మాట తప్పారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగవన్నారు. టీడీపీ ఘన విజయం సాధించి... మళ్లీ చంద్రబాబు గౌరవంగా అసెంబ్లీలో అడుగుపెడతారని తెలిపారు. జగన్ ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుందని ఆ పార్టీ నేతలు కూడా కోరుకుంటున్నారని కళా వెంకట్రావు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-06-22T13:28:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising