YV Subbareddy: ఫిషింగ్ హార్బర్ ప్రమాదం.. ప్రభుత్వ చర్యల వల్ల పెద్ద విపత్తును కాపాడగలిగాం
ABN, First Publish Date - 2023-11-21T12:43:19+05:30
ఫిషింగ్ హార్బర్‌లో ప్రమాద ఘటన స్థలాన్ని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి మంగళవారం సందర్శించారు.
విశాఖపట్నం: ఫిషింగ్ హార్బర్‌లో ప్రమాద ఘటన స్థలాన్ని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి (YCP Leader YV Subbareddy) మంగళవారం సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని.. ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు. పక్కనే డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ ఉన్నా.. ప్రభుత్వ చర్యల వల్ల పెద్ద విపత్తు కాపాడగలిగామని చెప్పుకొచ్చారు. ఇన్సూరెన్స్‌తో సంబంధం లేకుండా సీఎం ఉదారంగా ఆలోచించి సహాయానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచిచ్చారన్నారు. గత ప్రభుత్వ హామీలు పూర్తి కాకపోవడంతో బోటు ఓనరలో అపోహలున్నాయని ఆయన అన్నారు.
తమ ప్రభుత్వం భరోసా ఇచ్చిందంటే.. వాటిని పూర్తి చేసి అండగా నిలబడతామని స్పష్టం చేశారు. పూర్తిగా నష్టపోయిన బోట్లకు 80 శాతం పరిహారం అందజేస్తామని ప్రకటించారు. బోటు కలాసిల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. పోర్టు అధికారులతో మాట్లాడి.. తక్షణమే మునిగిన బోట్లను తీయించి కార్యకలాపాలు కొనసాగేలా చూస్తామన్నారు. ప్రమాదం కారణాలపై రకరకాల వెర్షన్స్ వినిపిస్తున్నాయని.. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారన్నారు. ప్రమాదం వెనుక కుట్ర, ఆకతాయితనం ఉన్నా క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిషింగ్ హార్బర్‌లో భద్రతా చర్యలు పెంపొందించాలని సీపీతో మాట్లాడామని.. సీసీ కెమెరాలు పనిచేయకుండా ఎందుకు తాత్సరం చేస్తున్నారో ఎంక్వైరీ చేయాలని ఆదేశించామన్నారు. ఫిషింగ్ హార్బర్ భద్రతలో పోలీసు నిర్లక్ష్యంపైనా చర్యలు తీసుకోవాలని సీపీతో చెప్పినట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
Updated Date - 2023-11-21T12:43:20+05:30 IST