Botsa Satyanarayana: ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా పాలసీ తెచ్చాం
ABN, First Publish Date - 2023-11-04T16:28:58+05:30
గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక పేరుతో టీడీపీ జేబులు నింపుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇసుక విధానంలో అవినీతి జరిగింది కాబట్టి కేసు పెట్టాల్సి వచ్చిందని
విజయనగరం: గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక పేరుతో టీడీపీ జేబులు నింపుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇసుక విధానంలో అవినీతి జరిగింది కాబట్టి కేసు పెట్టాల్సి వచ్చిందని మంత్రి (Botsa Satyanarayana) వ్యాఖ్యానించారు. జామి మండలం అలమండలో వైసీపీ సాధికార బస్సు యాత్రను బొత్స ప్రారంభించి మాట్లాడారు. ఇటీవల జరిగిన రైలు ప్రమాద బాధితులను ఆదుకోవడంలో సీఎం జగన్ (CM jagan) ఎంతో మానవత్వం ప్రదర్శించారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో (ycp government) అవినీతి లేకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా పాలసీ తెచ్చామన్నారు. కోర్టు తీర్పులను గౌరవిస్తూనే అన్ని అనుమతులు తీసుకొని రుషికొండ నిర్మాణాలు చేపట్టామని బొత్స పేర్కొన్నారు.
Updated Date - 2023-11-04T16:28:59+05:30 IST