ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ashok Gajapathi Raju: జగన్ అరెస్టు సమయంలో ఆ నేతలు ఏమన్నారో అందరికీ తెలుసు..

ABN, First Publish Date - 2023-09-22T13:07:47+05:30

విజయనగరం: లక్ష కోట్లు జగన్మోహన్ రెడ్డి దిగమింగారని విచారించి అనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అరెస్ట్ చేసిందని, అప్పటి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి ధర్మాన తదితరులు జగన్ అరెస్ట్ సమయంలో ఏమన్నారో అందరికీ తెలుసునని టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు.

విజయనగరం: లక్ష కోట్ల రూపాయలు (One lakh crore rupees) జగన్మోహన్ రెడ్డి (Jagan) దిగమింగారని విచారించి అనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ (Congress) అరెస్ట్ (Arrest) చేసిందని, అప్పటి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ (Bosta Satyanarayana), మంత్రి ధర్మాన (Dharma) తదితరులు జగన్ అరెస్ట్ సమయంలో ఏమన్నారో అందరికీ తెలుసునని టీడీపీ సీనియర్ నేత (TDP Senior Leader), మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ జగన్‌ను అరెస్ట్ చేసినప్పుడు ఉన్న బొత్స, ధర్మానను ఇప్పుడు సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని, టీడీపీ నేతలను హింసిస్తున్నారని అన్నారు. అన్నీ ఆధారాలు నిర్ధారణ అయిన తరువాతే జగన్‌ను అప్పుడు అరెస్టు చేశారన్నారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తీరు ఏ చట్టమో ఎవరికీ అర్ధం కావటం లేదని.. దైవ దర్శనంకు వెళతామంటే అరెస్ట్ చేస్తారా..? ఇదెక్కడి చట్టమని అశోక్ గజపతిరాజు తీవ్ర స్థాయిలో విమర్శించారు.

కాగా చంద్రబాబు కోసం ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ దర్గాలో ప్రార్ధనలు చేస్తున్నారు. బాబు జైలు నుంచి బయటకు రావాలని కోరుతూ కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా ప్రార్ధనలు చేశారు. దర్గాపైన చాదర్ సమర్పించి దువా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ కేసుల నుంచి విముక్తి పొంది ఏపీ సీఎం కావాలని ప్రార్ధించానన్నారు. నారా లోకేశ్‌కు కూడా మనోధైర్యం కల్పించి ముందుకు సాగాలని కోరుకున్నానని అత్తార్ చాంద్ బాషా స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-22T13:07:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising