ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pattabhi Update: రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పట్టాభి.. జైలు అధికారులపై జడ్జి ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారంటే..

ABN, First Publish Date - 2023-02-23T02:51:55+05:30

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌తోపాటు పది మందిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ/గన్నవరం (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌తోపాటు పది మందిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. గన్నవరంలో జరిగిన ఘటనలకు సంబంధించి నమోదు చేసిన మూడు కేసుల్లో 13 మందిని పోలీసులు నిందితులుగా చూపించారు. వారిలో పట్టాభితోపాటు పది మందిని గన్నవరంలోని అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. తోట్లవల్లూరు పోలీ్‌సస్టేషన్‌లో ముగ్గురు వ్యక్తులు ముసుగు వేసి తనను కొట్టారని పట్టాభి చెప్పడంతో న్యాయమూర్తి శిరీష వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. మిగతా పదిమందిని గన్నవరం సబ్‌జైలుకు రిమాండ్‌ విధించారు. పట్టాభిని పరీక్షించడానికి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఐదుగురు వైద్యులతో ఒక టీమ్‌ను ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి ఒంటి గంట వరకు పట్టాభికి ఆస్పత్రిలో పరీక్షలు జరిగాయి. అనంతరం ఆయనను పోలీసులు గన్నవరం పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. రాత్రంతా ఆయనను అక్కడే ఉంచారు. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు తిరిగి పట్టాభితోపాటు సబ్‌జైలులో ఉన్న పది మందిని న్యాయస్థానానికి తీసుకెళ్లారు. ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు చేసిన పరీక్షలకు సంబంధించిన నివేదికను న్యాయమూర్తికి అందజేశారు.

‘గాయాల’పై వైద్యుల నివేదిక

పట్టాభి కోర్టుకు వెళ్తున్న సమయంలో వ్యాన్‌లో నుంచి తన అరచేతిపై ఉన్న గాయాలను మీడియాకు చూపించారు. ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదికలో మాత్రం పట్టాభి శరీరంపై తీవ్రమైన గాయాలు ఏమీ లేవని పేర్కొన్నారు. ‘‘పట్టాభి శరీరంపై ఎలాంటి తీవ్రమైన గాయాలు లేవు. ఆయన అరచేతిపై వాపు మాత్రమే ఉన్నది. అది 36 గంటల కిందటిది’’ అని తేల్చారు. వైద్యుల నివేదికను న్యాయమూర్తి పరిశీలించారు. దీంతోపాటు పట్టాభి ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిశీలించిచూశారు. రిమాండ్‌కు ఆదేశించారు.

జైలు అధికారులపై జడ్జి ఆగ్రహం

పట్టాభితోపాటు పది మందికి రిమాండ్‌ విధించినప్పుడు గన్నవరంలోని సబ్‌జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దానిపై జైలు అధికారులు బుధవారం ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. 11 మందికి జైలులో బ్యారక్‌లు కేటాయించడం సాధ్యం కాదని, శాంతిభద్రతల సమస్య వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి శిరీష అసహనంవ్యక్తం చేసినట్టు తెలిసింది. రిమాండ్‌ విధించినప్పుడు ఎందుకుచెప్పలేదని ఆగ్రహించినట్టు సమాచారం.

Updated Date - 2023-02-23T14:18:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising