Vizainagaram: మంత్రి బొత్స ఇలాకాలో వైసీపీకి ఎదురు గాలి..
ABN, First Publish Date - 2023-04-28T12:35:59+05:30
విజయనగరం: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యానారాయణ (Minister Botsa Satyanarayana) ఇలాకాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP)కి ఎదురు గాలి వీస్తోంది.
విజయనగరం: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యానారాయణ (Minister Botsa Satyanarayana) ఇలాకాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP)కి ఎదురు గాలి వీస్తోంది. పలువురు వైసీపీ నాయకులు (YCP Leaders), కార్యకర్తలు (Activists) ఆ పార్టీకి మంగళం పాడి సైకిలెక్కారు. గుర్ల మండలం, దమరసింగి గ్రామ మాజీ సర్పంచ్ పీరు రామారావుతో పాటు వార్డు మెంబెర్లు.. మీసాల అప్పలనాయుడు, పొదిలాపు నర్సమ్మ, మీసాల రాము నాయుడు, కొల్లాన కాంతారావు కార్యకర్తలతో కలసి టీడీపీ (TDP)లో చేరారు. జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు.
కాగా ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన పథకాలు.. నవర త్నాలు కాదని, నవ మోసాలని ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి విమర్శించారు. నవరత్నాల పేరుతో సీఎం జగన్ (CM Jagan) ప్రజల్ని మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఊసరవెల్లిలా రోజుకో రంగు మారుస్తూ పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నాశనం చేస్తూ పేదలకు వైద్యం అందకుండా చేశారని మండిపడ్డారు. ఇప్పటికే వందల కోట్లు బకాయిలు ఆసుపత్రులకు ఇవ్వకపోవడంతో పేదలు వైద్యాన్ని అందుకోలేకపోతున్నారని మండిపడ్డారు. విదేశీ విద్యను పేద విద్యార్థులు దూరం చేసిన ఘనత జగన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. మద్యపానం నిషేధం అంటూ క్రమేపీ షాపులు పెంచుకుంటూ పోతున్నారని విమర్శించారు. పేదలకు ఇళ్లని చెప్పి ఒక్కటి కూడా పూర్తి చేసిన దాఖలాలు లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. పింఛన్ల కానుక పేరుతో ఏడాదికి రెండుసార్లు మాత్రమే పింఛన్ రిలీజ్ చేస్తున్నారని విమర్శలు చేశారు. ఇన్ని మోసాలు చేస్తున్న జగన్‌రెడ్డి కొత్తరంగు వేసుకొని మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు ఎత్తుగడలు వేస్తున్నారన్నారు. ప్రజలందరూ గ్రహించాలని, అభివృద్ధి సంక్షేమం కావాలంటే చంద్రబాబు (Chandrababu)ను వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేయాలని ఆమె కోరారు.
Updated Date - 2023-04-28T12:56:09+05:30 IST