ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Welfare Hostels : హాస్టల్‌ అంటే హడల్‌

ABN, First Publish Date - 2023-07-26T03:42:39+05:30

రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాలు వసతులలేమికి మారుపేరుగా మారాయి. హాస్టళ్లకు నిత్యావసర సరుకులు అంతంత మాత్రంగానే సరఫరా అవుతున్నాయి. ధరల పెరుగుదలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచడం లేదు. దీంతో విద్యార్థులు పప్పుచారుతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇక బీసీ సంక్షేమ వసతి గృహాలు ఎక్కువగా అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వాటిలోనూ సరైన వసతులు లేవు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ..

  • దుర్భరంగా సంక్షేమ వసతి గృహాలు

  • సరిగా లేని వసతులు.. అరకొర మెనూ

  • సరుకుల బిల్లులు సక్రమంగా చెల్లించని వైనం

  • అంతంత మాత్రంగానే నిత్యావసరాల సరఫరా

  • ధరలకు అనుగుణంగా పెరగని డైట్‌ చార్జీలు

  • హాస్టళ్లకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు దూరం

  • తగ్గుతున్న విద్యార్థుల అడ్మిషన్లు

  • చంద్రబాబు హయాంలో అదనంగా ప్రవేశాలు

  • హాస్టళ్ల మెరుగుకు ఏం చేస్తున్నారు?

    వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

  • విచారణ రెండు వారాలకు వాయిదా

ఆచరణలో మాత్రం పట్టించుకోవడం లేదు. సరైన వసతులు లేవు. నాణ్యమైన మెనూ అమలు చేయడం లేదు. నిత్యావసరాలు, పాలు, కూరగాయలు, గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. బిల్లులు అందడం లేదని ప్రతి నెలా ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. పలువురు కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లి బిల్లులు సాధించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ సర్కారు వచ్చినప్పటి నుంచీ ఇదే దుస్థితి.

(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాలు(Welfare Hostels) వసతులలేమికి మారుపేరుగా మారాయి. హాస్టళ్లకు నిత్యావసర సరుకులు(Essential commodities) అంతంత మాత్రంగానే సరఫరా అవుతున్నాయి. ధరల పెరుగుదలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచడం లేదు. దీంతో విద్యార్థులు పప్పుచారుతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇక బీసీ సంక్షేమ వసతి గృహాలు ఎక్కువగా అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వాటిలోనూ సరైన వసతులు లేవు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు హాస్టళ్ల మెట్లు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. వైసీపీ సర్కార్‌(YCP Govt) వచ్చిన తర్వాత హాస్టళ్లలో అడ్మిషన్లు తగ్గుతున్నాయి. చంద్రబాబు హయాం(Chandrababu)లో హాస్టళ్లలో మంజూరైన సీట్ల కంటే చేరే వారి సంఖ్య ఎక్కువగా ఉంటే... జగన్‌ ప్రభుత్వంలో మంజూరైన సీట్లు కూడా భర్తీ కావడం లేదు.ప్రతి ఏటా ఖాళీలు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు హాస్టళ్లలో ఉండి చదువుతున్నవారు సుమారు 6 లక్షల మంది దాకా ఉన్నారు. గురుకులాలను మినహాయిస్తే సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో 77,877 మంది, బీసీ సంక్షేమ హాస్టళ్లలో 92,748 మంది, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో 1,15,759 మంది ఉంటూ చదువుకునే అవకాశముంది. చంద్రబాబు హయాంలో ప్రతి ఏటా ఈ హాస్టళ్లలో అడ్మిషన్లు పూర్తి స్థాయిలో భర్తీ కావడమే కాకుండా అదనంగా చేర్చుకునేవారు. వైసీపీ సర్కార్‌ వచ్చిన తర్వాత వసతుల లేమితో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు హాస్టళ్లకు వెళ్లాలంటే హడలిపోతున్నారు. హాస్టళ్ల భవనాలు సరిగా లేకపోవడం, బాత్‌రూమ్‌లు పరిశుభ్రంగా లేకపోవడం, కొన్నిచోట్ల భవనాలు శిథిలావస్థలో ఉండటంతో బెంబేలెత్తుతున్నారు. దీంతో ప్రైవేట్‌ స్కూళ్లను ఆశ్రయిస్తున్నారు. 2020-21లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో 62,184 సీట్లు భర్తీ కాలేదు. 2021-22లో 70,120, 2022-23లో 37,202 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది కూడా సీట్లు భర్తీ కాలేదని సమాచారం హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. అదే టీడీపీ హయాంలో 2018-19లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు హాస్టళ్లలో సీట్ల సంఖ్య కంటే అదనంగా 10,605 మంది చేరారు. అదేవిధంగా 2019-20లో అదనంగా 5,930 మంది చేరినట్లు సంక్షేమ శాఖ విడుదల చేసిన గణాంకాలే చెబుతున్నాయి.

పెరగని డైట్‌ చార్జీలు

సంక్షేమ విద్యార్థుల డైట్‌ చార్జీలను చంద్రబాబు ప్రభుత్వంలో 2018లో పెంచారు. అప్పట్లో సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో చదివే 3, 4 తరగతి విద్యార్థులకు నెల డైట్‌ చార్జీలను రూ.750 నుంచి రూ.1000కు పెంచారు. అదేవిధంగా 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.750 నుంచి రూ.1250కు, ఇంటర్‌ విద్యార్థులకు రూ.1200 నుంచి రూ.1400కు పెంచారు. ప్రతి ఏటా ఏప్రిల్‌ 15 కల్లా ఉన్నత స్థాయి కమిటీ సమావేశమై డైట్‌ చార్జీలు సమీక్షించాలని అప్పట్లో సీఎస్‌ ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఈ ప్రభుత్వంలో ఒక్క ఏడాది కూడా ఆ ఉత్తర్వులు అమలు చేయలేదు. నాలుగేళ్ల తర్వాత వైసీపీ సర్కార్‌ గత ఏడాది డైట్‌ చార్జీలు పెంచింది. అయితే ధరలకు అనుగుణంగా కాకుండా అరకొరగా పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే బడ్జెట్‌ కూడా ధరలకు అనుగుణంగా పెరగలేదు. ప్రతి ఏటా కేటాయింపులు తగ్గించడం, బిల్లులు ఇవ్వకపోవడంతో కేటాయించిన వ్యయం కూడా ఖర్చు చేసే పరిస్థితి లేదు. దీంతో ఉన్న దాంట్లోనే సర్దుబాటు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా చీడికాడలోని బీసీ బాలికల వసతిగృహం ఇది. ఇక్కడ మొత్తం 85 మంది బాలికలకు ఇదొక్కటే గది. వసతి చాలక ఇబ్బంది పడుతున్నారు.

రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. హాస్టళ్ల విద్యార్థులకు జగన్‌ మామ మెనూ అంటూ ఆర్భాటం చేసిన వైసీపీ సర్కార్‌.


హాస్టళ్ల మెరుగుకు ఏం చేస్తున్నారు?

వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

విచారణ రెండు వారాలకు వాయిదా

అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నిర్వహించే సంక్షేమ హాస్టళ్లలో మౌలికవసతులు మెరుగుపర్చేందుకు ఏమి చర్యలు తీసుకుంటున్నారో వివరాలు సమర్పించాలని పాఠశాలవిద్య, సాంఘిక-బీసీ సంక్షేమశాఖల ముఖ్యకార్యదర్శులు, డైరెక్టర్లను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయమూర్తులు జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ వెంకట జోతిర్మయితో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలికవసతులు కల్పించడంలేదని, వాటి నిర్వహణకు రూపొందించిన మార్గదర్శకాలు అమలుచేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాకినాడ రూరల్‌, జయప్రకాశ్‌నగర్‌కు చెందిన కీతినీడి అఖిల్‌ శ్రీగరుతేజ పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... హాస్టళ్లలో కనీస సదుపాయాలు లేక నిరుపేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. విద్యార్థులకు తగినన్ని మరుగుదొడ్లు, స్నానపు గదులు కూడా లేవని తెలిపారు.

Updated Date - 2023-07-26T04:18:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising