ముగిసిన జేఎన్‌టీయూ బాస్కెట్‌బాల్‌ జట్టుకు శిక్షణ

ABN , First Publish Date - 2023-01-04T00:01:17+05:30 IST

ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో వారం రోజుల పాటు జరిగిన జేఎన్టీయూ యూనివర్శిటీ మహిళా బాస్కెట్‌బాల్‌ జట్టు శిక్షణ కార్యక్రమం మంగళవారంతో ముగిసింది.

ముగిసిన జేఎన్‌టీయూ బాస్కెట్‌బాల్‌ జట్టుకు శిక్షణ
శిక్షణ ముగించుకున్న బాస్కెట్‌బాల్‌ మహిళా జట్టు

నేటి నుంచి చెన్నైలో సౌత్‌జోన్‌ పోటీలు

భీమవరం అర్బన్‌, జనవరి 3: ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో వారం రోజుల పాటు జరిగిన జేఎన్టీయూ యూనివర్శిటీ మహిళా బాస్కెట్‌బాల్‌ జట్టు శిక్షణ కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. జేఎన్టీయూ పంపించిన షూట్‌ను క్రీడాకారిణులకు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.జగపతిరాజు అందించారు. ప్రిన్సిపాల్‌ జగపతిరాజు మాట్లాడతూ ఇక్కడ శిక్షణ పొందిన పదకొండు మంది నేటి నుంచి చెన్నైలో జరగనున్న సౌత్‌ జోన్‌ పోటీల్లో విజయం సాధించాలన్నారు. అసిస్టెంట్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ హరిమోహన్‌, జి.సారిక, అవినాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-04T00:01:18+05:30 IST