Bommaji Anil: రైతు కూలీల సమస్యల పరిష్కరించేందుకు టీడీపీ కృషి చేస్తోంది
ABN, First Publish Date - 2023-04-22T22:30:28+05:30
రైతు కూలీల సమస్యలు టీడీపీ (TDP) హయాంలోనే పరిష్కారం అయ్యాయని చింతలపూడి నియోజకవర్గ (Chintalapudi Constituency) టీడీపీ యువ నేత బొమ్మాజీ అనిల్ (Bommaji Anil) అన్నారు.
ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: రైతు కూలీల సమస్యలు టీడీపీ (TDP) హయాంలోనే పరిష్కారం అయ్యాయని చింతలపూడి నియోజకవర్గ (Chintalapudi Constituency) టీడీపీ యువ నేత బొమ్మాజీ అనిల్ (Bommaji Anil) అన్నారు. మండల పర్యటనలో భాగంగా తాడువాయిలో పొగాకు గ్రేడింగ్ చేస్తున్న మహిళలతో బొమ్మాజీ అనిల్ మాట్లాడి కూలీ ఎంత వస్తుందని అడిగి తెలుసుకున్నారు. కనీసం వేతనం కూడా రావడంలేదని బొమ్మాజీ అనిల్‌కు కూలీలు వివరించారు.
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉపాధి హామీ కింద 100 రోజుల పనికి కనీస వేతనంగా రోజువారీ కూలీ రూ.250గా తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించిందని బొమ్మాజీ అనిల్ చెప్పారు. రైతు కూలీలను ఆదుకున్న ప్రభుత్వాలలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని అనిల్ తెలిపారు. రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని, రైతుల ప్రభుత్వమేనని తెలియజేసి వారికి బొమ్మాజీ అనిల్ మనో ధైర్యాన్ని కల్పించారు.
Updated Date - 2023-04-22T22:32:03+05:30 IST