ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP: వంద రోజులకు లోకేష్ పాదయాత్ర.. ద్వారకా తిరుమలలో ప్రత్యేక పూజలు

ABN, First Publish Date - 2023-05-15T15:24:07+05:30

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర మరింత దిగ్విజయంగా ముందుకు సాగాలని కోరుతూ ద్వారకాతిరుమల చిన్న వెంకన్న స్వామి ఆలయంలో గోపాలపురం నియోజకవర్గ టీడీపీ మద్దిపాటి వెంకటరాజు ప్రత్యేక పూజలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర (TDP Leader Naralokesh)మరింత దిగ్విజయంగా ముందుకు సాగాలని కోరుతూ ద్వారకాతిరుమల చిన్న వెంకన్న స్వామి ఆలయంలో గోపాలపురం నియోజకవర్గ టీడీపీ మద్దిపాటి వెంకటరాజు (Gopalapuram Constituency TDP Maddipati Venkataraju) ప్రత్యేక పూజలు చేశారు. యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గోపాలపురం నియోజవర్గ నేతలతో కలిసి ముందుగా పాదుకా మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించి ఆలయ ముఖ మండపంలో పండితుల నుంచి వేద ఆశీర్వచనం పొందారు.

తరువాత మద్దిపాటి వెంకటరాజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇబ్బందులు పడుతున్న అట్టడుగు వర్గాలు, నిరుపేదల కోసం జరుగుతోందన్నారు. ఈ పాదయాత్ర 365 రోజులూ నిర్విరామంగా సాగాలని, లోకేష్ పేరున స్వామివారి క్షేత్రంలో అర్చనలు ప్రత్యేక పూజలు జరిపినట్లు తెలిపారు. లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా నల్లజర్ల మండలం పోతవరంలో నేనుసైతం పేరుతో పాదయాత్రను తలపెట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న దుర్మార్గ, పన్నాగాలు పాటాపంచలు కావాలని వాటిని ఎదుర్కొనేందుకు యువనేత లోకేష్‌కు సైతం శ్రీవారి ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం రానున్న రోజుల్లో మరింత చురుగ్గా వ్యవహరిస్తామన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఈ నియోజకవర్గాన్ని ఎన్నడూ జరగనంత అభివృద్ధి చేస్తానని తెలిపారు. శ్రీవారి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసి భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కాలినడక భక్తుల కోసం రహదారులు, మార్గం మధ్యలో మంచినీటి షెల్టర్లు వంటి పలు సౌకర్యాలు కల్పిస్తామని మద్దిపాటి వెంకటరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-15T15:24:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising