CM Jagan: పోలవరం ప్రాజెక్ట్‌పై జగన్ ఏరియల్ సర్వే.. పనులను పరిశీలించిన సీఎం
ABN, First Publish Date - 2023-06-06T11:36:34+05:30
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. మంగళవారం ఉదయం పోలవరం ఫ్రాజెక్ట్ హెలీప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం ప్రాజెక్ట్‌పై ఏరియల్ సర్వే చేశారు.
ఏలూరు: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) పోలవరం ప్రాజెక్ట్‌ను (Polavaram Project) సందర్శించారు. మంగళవారం ఉదయం పోలవరం ఫ్రాజెక్ట్ హెలీప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం ప్రాజెక్ట్‌పై ఏరియల్ సర్వే చేశారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు స్పీల్ వే, అప్పర్ కాపర్ డ్యాంలను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. పనుల పురోగతిని ఫోటో ఎగ్జిభిషన్ ద్వారా జగన్‌కు అధికారులు వివరించారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ దగ్గరకు చేరుకున్న సీఎంకు డయాఫ్రం వాల్ పరిస్థితిని అధికారులు వివరించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద పరిశీలన పూర్తి అవడంతో హిల్ వ్యూ వద్ద సమీక్ష సమావేశానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి బయలుదేరి వెళ్లారు.
కాగా.. పోలవరం ప్రాజెక్ట్‌ను ఏపీ సీఎం జగన్ సందర్శిస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద మీడియాపై అధికారులు ఆంక్షలు విధించారు. పాస్‌లు ఉన్న వారిని మాత్రమే అనుమతించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు, పత్రికా ఫోటోగ్రాఫర్లకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. మీడియా ప్రతినిధులను డయాఫ్రమ్ వాల్ ప్రాంతానికే పరిమితం చేశారు. అక్కడ నుంచి ఎటూ వెళ్ళకుండా ఆంక్షలు విధిస్తున్నారు. అధికారుల తీరుపై మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-06-06T11:36:34+05:30 IST