ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Janasena: పోలవరంపై ఆసక్తికర విషయాలు బయటపెట్టిన నాదెండ్ల.. మరీ ఇంత మోసమా

ABN, First Publish Date - 2023-04-27T13:40:19+05:30

పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అని జనసేన పీఏసీ చైర్మన్ నాందెండ్ల మనోహర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: పోలవరం (Polavaram) ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అని జనసేన పీఏసీ చైర్మన్ నాందెండ్ల మనోహర్ అన్నారు. గురువారం భీమవరంలో వెంకట సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన నాదెండ్ల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మొన్న పవన్ కళ్యాణ్, తాను చేసిన ఢిల్లీ పర్యటనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయన్నారు. జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం (Jagan Government) పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేసేసిందని తెలిపారు. 45.72 మీటర్లు ఎత్తు ఉండాల్సిన పోలవరం ప్రాజెక్టును 41.15కు మొదటి దశలో పూర్తి చేస్తామని అనడం ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయితే ప్రాజెక్టు మరమత్తు కోసం 2,030 కోట్ల రూపాయలు పోలవరం అధారిటీ నుంచి సాంక్షన్ రాకపోయినా జీవో విడుదల చేయడం అవినీతి కాదా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలవరం పూర్తైపోతుందని మభ్యపెట్టడాన్ని ముక్తకంఠంతోటి ఖండించాలన్నారు. లక్ష కుటుంబాలు నిర్వాసితులైతే ప్రభుత్వం కేవలం 24 వేల కుటుంబాలకే పది లక్షల చొప్పున ఇచ్చేసి చేతులు దులుపుకుందామని చూస్తున్నారని మండిపడ్డారు. రాబోయే నెలలో పోలవరం ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని తెలిపారు. అదే రోజు సాయంత్రం కొవ్వూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత మోసం చేసిందో తెలియజేయనున్నట్లు చెప్పారు. ‘‘బైజుస్‌లో 700 కోట్లు స్కామ్ చేస్తారా.. ఇదేనా మీ ప్రభుత్వం పనితీరు’’ అంటూ నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-04-27T13:40:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising