Nimmala Ramanaidu: జగన్ క్రిమినల్ పనులకు ప్రత్యక్ష ఉదాహరణ వివేకా హత్య..
ABN, First Publish Date - 2023-04-29T14:16:52+05:30
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) తన చేతికి మట్టి అంటకుండా క్రిమినల్ పనులు చేస్తారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) ఆరోపించారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) తన చేతికి మట్టి అంటకుండా క్రిమినల్ పనులు చేస్తారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) ఆరోపించారు. ఈ సందర్భంగా శనివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ క్రిమినల్ (Criminal) పనులకు ప్రత్యక్ష ఉదాహరణ వైఎస్ వివేకా హత్య (YS Viveka Murder) అని అన్నారు. గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చిన జగన్ సీఎంగా రాష్ట్రానికి అవసరమా..? అని ప్రశ్నించారు. వివేకా హత్యపై సీబీఐ (CBI) విచారణ కోరి.. అధికారంలోకి రాగానే సీబీఐ విచారణ అక్కర్లేదని అన్నారని నిమ్మల తెలిపారు.
ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy)ని రక్షించకుంటే తాడేపల్లి కుట్ర బయటకు వస్తుందని జగన్ ఢిల్లీకి పరుగులు పెడుతున్నారని నిమ్మల రామానాయుడు అన్నారు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు వివేకా క్యారెక్టరుపై దిగజారి విమర్శలు చేశారని.. అఫిడవిట్లు వేశారని విమర్శించారు. నిందితుల కుటుంబ సభ్యులతో వివేకాకు అక్రమ సంబంధాలు అంటగట్టడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. రూ. 92 వేల కోట్లకు పైగా మద్యం విక్రయాలు అధికారికంగా జరిగితే.. అనధికారికంగా రూ. 1.22 లక్షల కోట్లు జరిగాయన్నారు. అలాగే రూ. 11 వేల కోట్లు కమీషన్లను జగన్ దండుకుంటున్నారని ఆరోపించారు.
సీఎం జగన్ మద్య నిషేధం హామీని పక్కన పెట్టి.. మద్యంపైనే ఆదాయం రాబడుతున్నారని నిమ్మల రామానాయుడు విమర్శించారు. మహిళల తాళిబోట్లు తాకట్టు పెట్టిన వ్యక్తి అని.. మహిళ సంక్షేమం కోసం మాట్లాడితే నమ్మాలా..? అని అన్నారు. పార్కులు.. కలెక్టరేట్లు.. భూములను తాకట్టు పెట్టారని.. ఇక ఇళ్ల స్థలాల పేరుమీద జరిగిన దోపిడీ చెప్పతరం కాదన్నారు. ఇళ్ల స్థలాల కొనుగోళ్లల్లో పేదలకు కలిగిన లాభం గోరంత.. వైసీపీ నేతలకు లాభం కొండంత అని నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-04-29T14:16:52+05:30 IST