ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nimmala Ramanaidu: వైసీపీ దుర్మార్గాల్ని ప్రజలు ఖాతరు చేయలేదు..

ABN, First Publish Date - 2023-08-19T15:11:15+05:30

అమరావతి: తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఉపఎన్నికల పోలింగ్ సరళి చూశాక వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాల్ని ప్రజలు ఖాతరు చేయలేదని స్పష్టమైందన్నారు.

అమరావతి: తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే (TDP MLA) నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా శనివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఉపఎన్నికల పోలింగ్ (By-Election Polling) సరళి చూశాక వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాల్ని ప్రజలు ఖాతరు చేయలేదని స్పష్టమైందన్నారు. వాలంటీర్లు ప్రలోభపెట్టినా, పోలీసులు భయపెట్టినా.. పల్లె ఓటర్లు పతనమయ్యే ప్రభుత్వాన్ని ఖాతరు చేయకుండా నిర్భయంగా టీడీపీ అభ్యర్థులకే ఓటేశారన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా శనివారం జరిగిన ఉపఎన్నికల్లో వాలంటీర్ల జోక్యాన్ని నిలువరించడంలో విఫలమైన కలెక్టర్లు, పోలీస్ అధికారులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. వైసీపీ నేతల ప్రలోభాలు, బెదిరింపులు, అక్రమాలు, అరాచకాల్ని, వాలంటీర్ల జోక్యాన్నికూడా ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ ముందుంచుతామన్నారు. ప్రజలకిచ్చిన హామీలు 98 శాతం నెరవేర్చామని, సంక్షేమ పథకాలతో వారి మనసులు చూరగొన్నామంటున్న అధికార పార్టీ.. సాధారణ పంచాయతీ ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు బరితెగించిందని నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.

Updated Date - 2023-08-19T15:11:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising