Yuvagalam: నారా లోకేష్‌కు పోలీసుల నోటీసులు..
ABN, First Publish Date - 2023-09-06T14:14:54+05:30
ప.గో. జిల్లా: టీడీపీ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా, బేతపూడిలో లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ప.గో. జిల్లా: టీడీపీ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)కు పోలీసులు నోటీసులు (Notices) ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా, బేతపూడిలో లోకేష్ యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ తానెక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలిగించలేదని, వైసీపీ (YCP) దాడులపై ముందే సమాచారమిస్తున్నా...పోలీసులు పట్టించుకోవట్లేదని, వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా పట్టించుకోలేదని అన్నారు. కవ్వింపు చర్యలు చేస్తున్నవారికే పోలీసులు భద్రత కల్పిస్తున్నారని, తమ జోలికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. పోలీసులు అనుమతించిన మార్గంలోనే పాదయాత్ర చేస్తున్నానని, ప్రజలు వచ్చి కలుస్తుంటే వారిని కూడా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చట్టాలు ఉల్లంఘించాలనే కోరిక తన జీవితంలో ఉండదని లోకేష్ స్పష్టం చేశారు.
వైసీపీ వాళ్లను కించపరిచేలా తామెప్పుడూ మాట్లాడట్లేదని, ఏ జిల్లాలో జరగని అరాచకాలు ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయని లోకేష్ ప్రశ్నించారు. తమ కార్యకర్తల చేతిలో ఎక్కడైనా ఒక్క రాయి అయినా చూశారా? అని ప్రశ్నించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మాత్రమే వినియోగించుకుంటున్నామని, తాను పాదయాత్రను శాంతియుతంగానే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తాము ఫిర్యాదులు చేసినా.. వాళ్లపై కేసులు నమోదు చేయట్లేదన్నారు. కొంతమంది పోలీసుల తీరు మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందన్నారు. ‘నన్ను కించపరిచేలా వైసీపీ శ్రేణులు కార్టూన్లు వేస్తున్నారు.. మాకు కూడా అనుమతించండి.. మేం కూడా ఫ్లెక్సీలు వేస్తాం’ అని లోకేష్ అన్నారు.
టీడీపీ శ్రేణులపై దాడి చేసిన వారి ఫొటోలు ఉన్నాయని వారిని అరెస్ట్ చేశారా? అని లోకేష్ ప్రశ్నించారు. కవ్వింపు చర్యలకు పాల్పడే ఫ్లెక్సీల సంస్కృతి ఇప్పుడే చూస్తున్నామన్నారు. సీఎం జగన్ పర్యటన ఉంటే చాలు.. హౌస్ అరెస్టులు చేస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-09-06T14:14:54+05:30 IST