ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: తణుకులో చంద్రబాబు పర్యటన.. వైసీపీలో కలకలం.. రాత్రికి రాత్రే...

ABN, First Publish Date - 2023-05-11T09:25:41+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తణుకు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) తణుకు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు (TDP Leaders) భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే టీడీపీ అధినేత పర్యటనతో వైసీపీలో కలకలం రేగింది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. తెలుగుదేశం ఫ్లెక్సీలకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు (YCP Leaders)ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. టీడీపీ ఫ్లెక్సీలకు పక్కనే జగన్ పథకాలకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రాత్రికి రాత్రే వైసీపీ ఫ్లెక్సీలు వెలిశాయి.

కాగా.. రేపు (శుక్రవారం) చంద్రబాబు ఇరగవరం నుంచి తణుకు వరకు 12 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. అకాల వర్షాల వల్ల దెబ్బ తిన్న రైతుల సమస్యను ఎత్తిచూపడానికి టీడీపీ అధినేత పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి చేపట్టిన దశలవారీ ఉద్యమంలో భాగంగా ఆయన గోదావరి జిల్లాల్లోని తణుకు నియోజకవర్గంలో 12 కిలోమీటర్ల దూరం ఈ యాత్ర చేయనున్నారు. పెద్ద సంఖ్యలో రైతులతో కలిసి ఆయన ఈ యాత్ర నిర్వహిస్తారు. దీనికి రైతు పోరుబాట అని పేరు పెట్టారు. తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం గ్రామం నుంచి ఈ యాత్ర ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 11 గంటలకు గోటేరు గ్రామం వద్ద కొద్దిసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. ఆపై సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తారు. తణుకు పట్టణం వరకూ ఈ యాత్ర సాగుతుంది. తణుకు పట్టణంలో ఆకుల శ్రీరాములు డిగ్రీ కళాశాల వద్ద బహిరంగ సభ జరుగుతుంది. కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం చంద్రబాబు గురువారం సాయంత్రమే ఇక్కడ నుంచి ఇరగవరం బయలుదేరి వెళ్లనున్నారు.

Updated Date - 2023-05-11T09:25:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising