TDP: టీడీపీ విజయం కోసం పని చేయాలని నేతలకు కోళ్ల నాగేశ్వరరావు దిశా నిర్దేశం
ABN, First Publish Date - 2023-04-12T19:36:43+05:30
జగన్ రెడ్డి ప్రభుత్వం (AP CM Jagan Reddy Govt)పై ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిందని నియోజకవర్గం పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు (Kolla Nageswara Rao) తెలిపారు.
ఏలూరు జిల్లా, బుట్టాయగూడెం: జగన్ రెడ్డి ప్రభుత్వం (AP CM Jagan Reddy Govt)పై ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిందని నియోజకవర్గం పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు (Kolla Nageswara Rao) తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కానీ, నిర్వాసితులకు న్యాయం చేసే విషయంలో పూర్తిగా జగన్ సర్కారు విఫలమైందని మండిపడ్డారు. నియోజకవర్గంలో ఇన్ ఛార్జీ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) ఆదేశాలు పాటిస్తూ అందరూ పార్టీ విజయం కోసం పని చేయాలని కోళ్ల నాగేశ్వరరావు దిశా నిర్దేశం చేశారు.
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం అన్ని మండలాల్లో పూర్తి చేయాలని, నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కష్టపడి పనిచేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఓటర్ హౌస్ మ్యాపింగ్ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని నాగేశ్వరరావు అన్నారు. ఎన్నికల్లో క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ చార్జీలదే కీలకపాత్ర అని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందరూ సిద్దంగా ఉండాలని ఆయన తెలిపారు.
బుట్టాయగూడెం క్యాంపు కార్యాలయంలో పోలవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు అధ్యక్షతన నియోజకవర్గం సమన్వయ కమిటీ, క్లస్టర్, యూనిట్ ఇన్ ఛార్జీలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గం పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శీలం వేంకటేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ యంట్రప్రగడ శ్రీనివాసరావు, ఏలూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి జారం చాందినీ విద్యా సాగరిక, మండల పార్టీ అధ్యక్షులు నాయుడు రామకృష్ణారావు గౌడ్, పారేపల్లి నరేష్, అమరవరపు అశోక్, బొడ్డు కృష్ణ, ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొట్ట రామారావు, మొడియం సూర్యచంద్రరావు, బిసి సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండపల్లి రవి, తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి తోట లక్ష్మి నారాయణ, తెలుగుమహిళా నియోజకవర్గం అధ్యక్షురాలు కుంజం సుభాషిణి, తెలుగుయువత నియోజకవర్గం అధ్యక్షులు గన్నిన సురేంద్రనాథ్ చౌదరి, నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు గుబ్బ రాంబాబు, మాజీ జడ్పీటిసి శాఖమూరి సంజివులు, కోర్సా వెంకటేశ్వరరావు, కాల్నిడి రాంబాబు, కుందుల శ్రీను, ఏలూరు పార్లమెంట్ ఐటిడిపి అధ్యక్షులు శావిలి సుభాష్ చంద్రబోస్, జితేంద్ర, ఆకుల అరుణ, పీ రమాదేవి, ఆకుల రాజాతోపాటు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-12T19:42:17+05:30 IST