Boragam Srinivasulu: సైకో పాలన పోయి.. సైకిల్ పాలన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది
ABN, First Publish Date - 2023-02-07T20:34:22+05:30
సైకో పాలన పోయి సైకిల్ పాలన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు.
కామయ్యపాలెం, (ఏలూరు జిల్లా): ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై పోలవరం నియోజకవర్గం టీడీపీ (TDP) కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డి పాలనలో నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, కరెంట్, ఆర్టీసీ చార్జీలను పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. నాసిరకం మద్యం అమ్మకాలు జగన్ రెడ్డి పాలన సైకో పాలనను తలపిస్తోందని శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం గ్రామంలో జరిగిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ప్రజల వద్దకు వెళ్లి జగన్ రెడ్డి సైకో పాలన గురించి వివరించారు. ప్రజల తరుపున జగన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాడుతున్నమని, ప్రజలందరూ ఈ పోరాటానికి మద్దతుగా+91 92612 92612 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని శ్రీనివాసులు కోరారు. సైకో పాలన పోయి సైకిల్ పాలన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు.
Updated Date - 2023-02-07T20:36:26+05:30 IST