ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP leader Maddipati Venkataraju: అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేస్తాం

ABN, First Publish Date - 2023-04-14T17:46:32+05:30

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ (Ambedkar) ఆశయ సాధన కోసం తామంతా ఎల్లవేళలా పనిచేస్తామని గోపాలపురం నియోజకవర్గ టీడీపీ (TDP) ఇన్ ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు (Maddipati Venkataraju) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ద్వారకాతిరుమల, పశ్చిమగోదావరి జిల్లా: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ (Ambedkar) ఆశయ సాధన కోసం తామంతా ఎల్లవేళలా పనిచేస్తామని గోపాలపురం నియోజకవర్గ టీడీపీ (TDP) ఇన్ ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు (Maddipati Venkataraju) అన్నారు. ద్వారకాతిరుమల మండలంలోని గొల్లగూడెంలో శుక్రవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

అనంతరం మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం విషయాల్లో ఆయన ఆశయాలు కొనసాగేలా తమ పార్టీ ఉంటుందని తెలిపారు. భారతదేశం అంటేనే అనేక మతాల కులాల సమ్మేళనమని, వారికి స్వేచ్ఛ స్వాతంత్రం కల్పించడం కోసం రాజ్యాంగంలో అనేక హక్కులను అంబేద్కర్ కల్పించారని మద్దిపాటి వెంకటరాజు వివరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్ల దేశంలో అన్ని వర్గాలు కులాలు సమానత్వంతో ఉన్నాయన్నారు. అటువంటి మహనీయుడైన అంబేద్కర్ ను ఒక దళిత వర్గాలకే మాత్రమే పరిమితం చేయవద్దని.. శిరస్సు వంచి కోరుతున్నానని ఆయన చెప్పారు. ఆ మహనీయుని జయంతిని ప్రతి ఒక్కరు జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-14T17:51:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising