Nimmala Ramanaidu: బలవంతంగా నిమ్మల రామానాయుడు అరెస్ట్.. యలమంచిలిలో ఉద్రిక్తత
ABN, First Publish Date - 2023-06-06T12:28:45+05:30
జిల్లాలోని యలమంచిలి మండలం చించినాడ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని అరెస్టుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. నిమ్మలను అరెస్ట్ చేయనీకుండా దళితులు, టీడీపీ నేతలు అడ్డుకున్నారు.
పశ్చిమగోదావరి: జిల్లాలోని యలమంచిలి మండలం చించినాడ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని (Palakollu MLA Nimmala Ramanaidu) అరెస్టుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. నిమ్మలను అరెస్ట్ చేయనీకుండా దళితులు, టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. చివరకు ఎమ్మెల్యే రామానాయుడిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని.. పాలకొల్లు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే.. చించినాడలో దళితుల భూముల స్వాధీనానికి సర్కారు కొంతకాలంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దళితులకు మద్ధతుగా నిన్నటి నుంచి రామానాయుడు ఆందోళన చేపట్టారు. ఈరోజు నిమ్మల రామానాయుడు చేస్తున్న ఆందోళనకు అడ్డుకున్న పోలీసులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Updated Date - 2023-06-06T12:28:45+05:30 IST