స్పందన అర్జీల ఆడిట్‌ : కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-02-20T23:54:43+05:30 IST

స్పందనలో వచ్చి న ప్రతీ అర్జీని క్షుణ్ణం గా చదివి సత్వరం పరిష్కరించాలని, మం డల స్థాయిలో పరిష్కరించిన అర్జీలను పరిశీలించి సక్రమంగా ఉందో లేదో ఆడిట్‌ చేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులకు సూచించా రు.

స్పందన అర్జీల ఆడిట్‌ : కలెక్టర్‌
స్పందనలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ ప్రశాంతి

భీమవరం, ఫిబ్రవరి 20 : స్పందనలో వచ్చి న ప్రతీ అర్జీని క్షుణ్ణం గా చదివి సత్వరం పరిష్కరించాలని, మం డల స్థాయిలో పరిష్కరించిన అర్జీలను పరిశీలించి సక్రమంగా ఉందో లేదో ఆడిట్‌ చేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులకు సూచించా రు. భీమవరం కలెక్టరేట్‌ స్పందన సమావేశ మందిరంలో సోమవారం అర్జీదారుల నుంచి మొత్తం 142 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్పందన అర్జీల పరిష్కారానికి జిల్లా, మండల స్థాయిలో ప్రాజె క్టు మేనేజ్‌మెంట్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తామని, వాటి ద్వారా అర్జీల పరిష్కారాన్ని పరిశీలించనున్నట్టు తెలిపారు. కన్సిస్టెంట్‌ రిథం అనే యాప్‌లో విద్యకు సంబంధించిన వివిధ సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఎంఈవో లు, ఏపీఎంలు, సీసీలు, వెల్ఫేర్‌ సెక్రటరీలు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, మహి ళా పోలీసులు వాటిని ఓపెన్‌ చేసి పరిష్కరించాలన్నారు. డీఆర్వో కె.కృష్ణవేణి, జిల్లా జీఎస్‌డబ్ల్యూఎస్‌ ఆఫీసర్‌ కేసీహెచ్‌ అప్పారావు, డీఎస్పీ బి.శ్రీనాథ్‌, ఎం.నాగలత, వివిధ శాఖల జిల్లా అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు.

సైబర్‌ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి : ఎస్పీ

భీమవరం క్రైం, ఫిబ్రవరి 20 : సోషల్‌ మీడియా మాధ్యమాల ద్వారా లింకులు పంపించి మోసం చేసే సైబర్‌ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండా లని జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్‌ సూచించారు. భీమవరం సబ్‌ డివిజన్‌ అధికారి కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలలు నుంచి వచ్చిన 13 మంది ఎస్పీకి ఫిర్యాదులు అందించారు. ఎక్కువగా వరకట్నం వేధింపులు, సరిహద్దుల విషయంలో గొడవలు, సివిల్‌ వివాదాలపై ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులన్నింటిపై సత్వరమే చట్టప్రకారం విచారణ చేసి పరిష్కరించాలని సిబ్బందికి ఎస్పీ ఫోన్‌లో ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2023-02-20T23:54:45+05:30 IST