Paritala Sunitha: తిరుమలను ఏం చేయాలనకుంటున్నారు..?: పరిటాల సునీత
ABN, First Publish Date - 2023-03-26T21:30:11+05:30
తిరుమలను వైసీపీ నేతలు ఏం చేయాలనుకుంటున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunitha) మండిపడ్డారు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలలో గంజాయి
అనంతపురం: తిరుమలను వైసీపీ నేతలు ఏం చేయాలనుకుంటున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunitha) మండిపడ్డారు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలలో గంజాయి, డ్రగ్స్ విక్రయాలు దారుణమన్నారు. తిరుమల (Tirumala)లో పొగతాగడం కూడా నిషేధమనీ, అలాంటి ప్రాంతంలో మద్యం బాటిళ్లు, గంజాయి, డ్రగ్స్ దొరకడం ఏమిటని నిలదీశారు. నిత్యం గోవింద నామం వినిపించే అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటంపై పాలకులు సమాధానం చెప్పాలని నిలదీశారు. తిరుమలలో కూడా పాలన తీరు మార్చుకోవడం లేదంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వార్షిక నివేదిక మేరకు గంజాయి రవాణాలో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. దేశంలో పట్టుబడిన 7.5 లక్షల కిలోల గంజాయిలో 2021లో ఒక్క ఏపీ నుంచి 26 శాతం పట్టుబడడం వైసీపీ పాలనకు నిదర్శనమన్నారు. ప్రజలకు మంచిచేసే విషయంలో ముందు ఉండాల్సిన ప్రభుత్వం.. ఇలాంటి వ్యవహారాల్లో అగ్రస్థానంలో నిలవడం సిగ్గుచేటన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఎవరు వ్యవహించినా దేవుడు శిక్షించడం ఖాయమని సునిత పేర్కొన్నారు.
Updated Date - 2023-03-26T21:30:11+05:30 IST