Cm Jagan: పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే..
ABN, First Publish Date - 2023-07-11T21:55:07+05:30
ఏపీ ముఖ్యమంత్రి జగన్ (Cm Jagan) నేతృత్వంలో క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశం జరిగింది.
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ (Cm Jagan) నేతృత్వంలో క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశం జరిగింది. ఎస్‌ఐపీబీ సమావేశంలో పలు ప్రాజెక్టులకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే రావాలని సీఎం జగన్ అన్నారు. ఈ విధానం సరిగ్గా అమలవుతుందో లేదో 6 నెలలకు ఒకసారి కలెక్టర్లు నివేదికలు ఇవ్వాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.
ఎస్ఐపీబీలో ఆమోదం పొందిన కొన్ని ప్రతిపాదనలు
వైఎస్ ఆర్ జిల్లా వేంపల్లి మండలం అశోక్ నగర్ బక్కన్నవారి పల్లె వద్ద 1500 మెగావాట్ల హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్.. 2024 నుంచి ఈ ప్రాజెక్టుల పనులు ప్రారంభంకానున్నాయి.
నంద్యాల, అనంతపురం, వైఎస్‌ఆర్ జిల్లాల్లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ అనుబంధ సంస్థ క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటుకు నిర్ణయం
విశాఖ జిల్లా అన్నవరంలో హోటళ్లు, రిసార్ట్‌లు
తిరుపతి పేరూరు వద్ద హయత్ ఇంటర్నేషనల్ హోటల్ నిర్మాణానికి ఆమోదం.
విశాఖపట్నం జిల్లా అత్యుతాపురం సమీపంలో కృష్ణపాలెం వద్ద హిందుస్థాన్ కోకాకోలా బేవరేజస్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుకు నిర్ణయం
వీటితోపాటు, మరో మూడు కీలక ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీలో సీఎం ఆమోదం తెలిపారు.
Updated Date - 2023-07-11T22:04:19+05:30 IST