ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Varla Ramaiah: ఆ అదృష్టం వైఎస్సార్‌కు లేదు.. జగన్ రెడ్డి మీ నాన్న ఆత్మ క్షోభస్తుంది

ABN, First Publish Date - 2023-07-08T21:52:36+05:30

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (YS Jaganmohan Reddy) టీడీపీతోనే భవిష్యత్‌కు గ్యారంటీ బస్సు యాత్రలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జి.కొండూరు, ఎన్టీఆర్ జిల్లా: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (YS Jaganmohan Reddy) టీడీపీతోనే భవిష్యత్‌కు గ్యారంటీ బస్సు యాత్రలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) విమర్శలు గుప్పించారు. '' తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకొని లక్ష కోట్లు దండుకొని చిప్ప కూడు తిన్న వ్యక్తి జగన్ రెడ్డి. పనికి రాని చెత్త మనుషులు ఆయనను పనికి రాడన్నారు. లోకేష్ ఒక శక్తిలా పాదయాత్ర చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు కలిసి నివాళులు అర్పించే అదృష్టం వైఎస్సార్‌కు లేదు. మిమ్మల్ని మీ తండ్రి హైదరాబాద్ నగరంలో ఎందుకు ఉన్నామన్నారో ప్రజలకు చెప్పగలవా జగన్ రెడ్డి. మీ నాన్న ఆత్మ క్షోభస్తుంది జగన్ రెడ్డి." అని వర్ల రామయ్య మండిపడ్డారు.


"మీ అమ్మ, చెల్లెలు ఎక్కడ జగన్ రెడ్డి. అమ్మకు అన్నం పెట్టని వాడు చెల్లికి బంగారం పెడతాడంట. ఆఖరికి మీ బాబాయిని కూడా వదల్లేదు. మీ నాన్న ఆశీస్సులు నీకు ఎందుకు ఉంటాయి జగన్ రెడ్డి. ఇది రైతు దినోత్సవం కాదు వైఎస్సార్ ఆత్మ క్షోభ దినోత్సవం. 2004లో మీ ఆస్తులెంత. ఇప్పుడు మీ ఆస్తులెంత జగన్ రెడ్డి. నువ్వు ఏం పని చేసి సంపాదించావ్ అని నువ్వు దేశంలో ధనిక సీ ఎం అయ్యావు.'' అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

"కృష్ణా జిల్లా అంటే దేవినేని ఉమా, ఉమా అంటే కృష్ణా జిల్లా. దేవినేని ఉమాను మైలవరం నుంచి అఖండ మెజారిటీతో గెలిపించాలి. చంద్రబాబు మది ఎరిగిన వ్యక్తి దేవినేని ఉమా. రాబోవు ఎన్నికల్లో దళితులంతా కలిసి చంద్రబాబు, ఉమాను గెలిపించాలి" అని వర్ల రామయ్య అన్నారు.

Updated Date - 2023-07-08T21:53:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising