Ycp Mp bose: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ బోస్
ABN, First Publish Date - 2023-07-25T17:46:34+05:30
పార్టీ మారుతున్నారన్న ఊహాగానాలకు వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ (pilli subhash chandra bose) తెరదించారు.
కోనసీమ: పార్టీ మారబోతున్నారంటూ వెలువడుతున్న ఊహాగానాలపై వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ (pilli subhash chandra bose) స్పందించారు. తాను టీడీపీ, జనసేన పార్టీలలో చేరుబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ ప్రచారాన్ని నమ్మొద్దని పార్టీ నేతలు, కార్యకర్తలకు బోస్ తెలిపారు. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి ఆయన తెరదించారు.
రామచంద్రాపురంలో అభ్యర్థి ఎవరో సీఎం జగన్ (Jagan) నిర్ణయిస్తారని, పార్టీ నిర్మాణంలో తాను కూడా ఒక పిల్లర్‌ను అని బోస్ వెల్లడించారు. రామచంద్రాపురంలో సీఎం ప్రత్యేక సర్వే చేయిస్తానని మాట ఇచ్చారని, అప్పుడు ఎవరి బలం ఏంటి అనేది తేలుతుందన్నారు. సీఎం జగన్‌కు బోస్ కృతజ్ఞతలు తెలిపారు. సర్వే నివేదిక ఆధారంగా టికెట్ ఉంటుందని జగన్ చెప్పారని ఆయన పేర్కొన్నారు.
మరోసారి హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఎంపీ బోస్, ఆయన తనయుడు తాడేపల్లికి చేరుకున్నారు. తొలుత ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అవుతారని భావించారు. కానీ చివరి నిమిషంలో తూర్పుగోదావరి జిల్లా ఇంఛార్జ్ మిథున్‌రెడ్డితో తండ్రీకొడుకులిద్దరూ సమావేశం అయ్యారు. ఈ భేటీలో మిథున్‌రెడ్డి.. బోస్ పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
Updated Date - 2023-07-25T18:34:15+05:30 IST